తన కెరీర్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చిన మమతా మోహన్ దాస్..!

కెరీర్ ప్రారంభంలో సింగర్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ యమదొంగ చిత్రంతో హీరోయిన్ గా కూడా మారింది మమతా మోహన్ దాస్. ఈమె లో ఉన్న అద్భుతమైన టాలెంట్ చూసి హీరోయిన్ అవకాశం ఇచ్చాడు దర్శక ధీరుడు రాజమౌళి. మొదటి చిత్రంతోనే హిట్ అందుకని బోలెడన్ని అవకాశాలు సంపాదించుకుంది కానీ.. సరైన హిట్ మాత్రం దక్కించుకోలేకపోయింది. కొన్నాళ్ల తర్వాత ఈమె టాలీవుడ్ కు దూరం అయింది. మధ్యలో క్యాన్సర్ బారిన పడటంతో ఈమె ఏమి అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకుంది.

అదృష్టవశాత్తు త్వరగానే కోలుకుంది. ఇదిలా ఉండగా.. ఈమె టాలీవుడ్ కు మళ్లీ రీ ఎంట్రీ ఇస్తుందని గత కొద్ది రోజుల నుండి ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 15 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా తన కెరీర్ గురించి ఆసక్తికరమైన సంగతులు తెలియజేసింది. ఈమె మాట్లాడుతూ…”సినీ కెరీర్‌ను నేను ఎప్పటికీ ఎంజాయ్‌ చేస్తూనే ఉంటాను. కెరీర్‌ ప్రారంభించిన కొద్ది టైంలోనే ఆశించిన సక్సెస్‌ రావడం కష్టమని నాకు అప్పుడే తెలిసింది. కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల సినిమాల నుంచి తరచూ గ్యాప్‌ తీసుకుంటూ వచ్చాను.

గ్యాప్ తీసుకున్న ప్రతిసారీ విభిన్నమైన పాత్రల్లో నటించాలనే ఆశ నాకు కలుగుతూ ఉండేది. ఇప్పుడు కూడా మాంచి కథ కోసమే ప్రేక్షకులను అలరించాలని భావిస్తున్నాను. ఈ సంవత్సరం ప్రారంభంలో ఓ ప్రాజెక్ట్‌ నిర్మించాలనుకున్నాను. మార్చి నెలలో ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ పూర్తి చేసి మేలో షూటింగ్‌ ప్రారంభించాలని అనుకున్నాము.అయితే అనుకోకుండా కరోనా వల్ల పరిస్థితులన్నీ తారు మారు అయిపోయాయి.ఒక విధంగా అదే మంచిదయ్యింది.ఒకవేళ ప్రీ ప్రొడక్షన్‌ పనులయ్యక… లాక్‌డౌన్‌ వచ్చుంటే మేము మరింత ఇబ్బందిపడేవాళ్లం. ఇప్పుడున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మా ప్రాజెక్ట్‌ను కొంతకాలంపాటు వాయిదా వెయ్యాలని డిసైడ్ అయ్యాను’ అంటూ మమతా మోహన్‌దాస్‌ చెప్పుకొచ్చింది.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Share.