అల్లు అరవింద్ ఆఫర్ కి తల తిరిగిపోయే రిప్లై ఇచ్చిన మమ్ముట్టి

తమిళ, మలయాళ, కన్నడ, భోజ్ పురి హీరోలు తెలుగు, హిందీ భాషల్లో విలన్స్ గా చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. అల్లు అరవింద్ కూడా అలానే అనుకోని “జల్సా” సినిమాలో విలన్ గా నటించమని మమ్ముట్టిని అడిగాడట. అప్పుడు మమ్ముట్టి ఇచ్చిన రిప్లై విని ఫోన్ పెట్టేశాడట అల్లు అరవింది. ఆ సందర్భాన్ని నిన్న జరిగిన “మమాంగం” ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ గుర్తు చేసుకుంటూ..

Mammootty With Chiranjeevi

“పదేళ్ల క్రితం ఒకసారి నేను మమ్ముట్టిగారికి కాల్ చేశాను. “సార్ .. మా సినిమాలో ఒక మంచి పాత్ర వుంది .. మీరు చేయాలి” అన్నాను. ‘ఏం క్యారెక్టర్ అది’ అని మమ్ముట్టిగారు అడిగారు. పవన్ కల్యాణ్ హీరోగా చేస్తున్నాడు .. అందులో చాలా మంచి విలన్ క్యారెక్టర్ అని చెప్పాను. “అహా అట్లాగా .. ఈ పాత్రను చిరంజీవిని వేయమని నువ్వు అడగ్గలవా” అని తిరిగి ప్రశ్నించారు మమ్ముట్టి. “నేను అడగనండీ” అని చెప్పాను. “మరి నన్నెందుకు అడుగుతున్నావ్” అని ఆయన తిరిగి ప్రశ్నించారు. “సారీ సార్..” అని ఫోన్ పెట్టేశాను” అని జల్సా టైమ్ లో జరిగిన విషయాన్ని చెప్పుకొచ్చాడు అల్లు అరవింద్. దాంతో జల్సాలో ముఖేష్ రుషి క్యారెక్టర్ కు తొలుత మమ్ముట్టిని అనుకొన్నారా అని అందరూ షాక్ అయ్యారు.

అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Share.