నాగ చైతన్య కెరీర్లో ఇదే బెస్ట్ పెర్ఫార్మన్స్..!

ప్రేమలో విఫలమయ్యి … తాగుడికి బానిస అయిన ఓ యువకుడి జీవితంలోకి .. భర్తే ప్రాణమని… తనని అపురూపంగా చూసుకోవాలని నమ్మే ఓ మంచి అమ్మాయి భార్యగా వస్తే.. ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుంది…? తరువాత అతని భార్య కారణంగా ఆ యువకుడి లైఫ్ ఎలా చక్కబడింది అనే కధాంశంతో తెరకెక్కింది ‘మజిలీ’ చిత్రం. పెళ్ళైన తరువాత మొదటి సారి నాగ చైతన్య, సమంత కలిసి నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్నాడు.

ఇక ఈ చిత్రంలో చైతూ క్రికెటర్ గా కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో తన క్యారెక్టర్ చాలా కొత్తగా ఉండబోతుందని తెలుస్తుంది.ఇప్పటి వరకూ ఇలాంటి క్యారెక్టర్ చైతూ ఎప్పుడూ చేయలేదట. చైతూ ప్రేకులురాలిగా దివ్యాంశ కౌశిక్‌ నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ తో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో చైతూ మరింత యంగ్ గా కనిపిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో పెళ్ళైన తరువాత ‘నాగ చైతన్య – సమంత’ మధ్య వచ్చే సీన్లు చిత్రానికి హైలెట్ గా నిలుస్తాయని చిత్ర యూనిట్ తెలిపింది. రావు ర‌మేష్, పోసాని కృష్ణ‌ముర‌ళి, సుబ్బ‌రాజ్ ఈ చిత్రంలో కీల‌క‌పాత్ర‌ల్లో కనిపించబోతున్నారు. గోపీసుంద‌ర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి .. విష్ణు వ‌ర్మ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నాడు. ‘షైన్ స్క్రీన్స్’ బ్యాన‌ర్ పై సాహు గ‌ర‌పాటి, హ‌రీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 5 న ఈ చిత్రం విడుదల కాబోతుంది.

Share.