‘మజిలీ’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది..!

పెళ్ళైన తరువాత నాగ చైతన్య , సమంత జంటగా నటించిన చిత్రం ‘మజిలీ’. ‘నిన్ను కోరి’ వంటి సూపర్ హిట్టిచ్చిన శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకుడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన ఈ చిత్రాన్ని ‘షైన్ క్రియేషన్స్’ సంస్థ నిర్మించింది. ఇక తాజాగా ఈ చిత్రానికి సంబందించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు వారు యూ/ ఏ సర్టిఫికెట్ ను జారీ చేసింది. చైతన్య, దివ్యంశ కౌశిక్ మధ్య వచ్చే లిప్ లాక్, రొమాంటిక్ సన్నివేశాల కారణంగా ఈ చిత్రానికి యూ/ ఏ ఇచ్చినట్టు తెలుస్తుంది.

ఈ చిత్రం ఫస్ట్ హాఫ్ మొత్తం సరదా సరదాగా సాగిపోతుందట. చైసామ్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయట. పూర్ణ, శ్రావణి పాత్రల్లో వారిద్దరూ జీవించారట. పోసాని, రావు రమేష్ పత్రాలు కూడా అలరిస్తాయట. సెకండ్ హాఫ్ మొదట్లో కొంచెం సాగదీతగా అనిపించినా… క్లయిమాక్స్ మాత్రం మంచి ఎమోషనల్ గా సాగుతుందని సమాచారం. ‘రాజా రాణి’ లానే ఈ చిత్రం కూడా మంచి ‘ఫీల్ గుడ్’ మూవీ అవుతుందని వారు చెబుతున్నారు. గోపి సుందర్ అందించిన పాటలు అలరించే విధంగా ఉన్నాయట. తమన్ అందించిన నేపధ్య సంగీతం హైలెట్ గా నిలుస్తుందని సమాచారం. మాస్ ఆడియన్స్ ను సైతం అలరించే ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉన్నాయట. ముఖ్యంగా ప్రేమికులు, పెళ్ళైన వాళ్ళు ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేయడం ఖాయమని సెన్సార్ బోర్డు వారు చెబుతున్నారు. ఉగాది పండుగ సెలవు రావడం కూడా ‘మజిలీ’ చిత్రానికి కలిసొచ్చే అవకాశం. మరి చైసామ్ కు ‘మజిలీ’ ఎలాంటి విజయాన్నిస్తుందో చూడాలి..!

Share.