బ్రేక్ ఈవెన్ దిశగా చైసామ్ ల ‘మజిలీ’..!

‘షైన్ క్రియేషన్స్’ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మించిన తాజా చిత్రం ‘మజిలీ’. ‘నిన్నుకోరి’ ఫేమ్ శివ నిర్వాణ డైరెక్షన్లో నాగచైతన్య, సమంత జంటగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 5 న విడుదలయ్యింది. మొదటి షో నుండే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. దివ్యంశ కౌశిక్ మరో హీరోయిన్ గా నటించింది. చైసామ్ కి ఉన్న క్రేజ్ ఈ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడింది. దానికి తక్కట్టు గానే ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికీ ఈ చిత్రం భారీ కలెక్షన్స్ ను రాబట్టింది. ఉగాది పండుగ సెలవు కూడా ఈ చిత్రానికి బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. మొదటి వారం పూర్తయ్యే సరికి ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 17.37 కలెక్షన్ల షేర్ ను రాబట్టింది. ఈ చిత్రం ఏరియా వైజ్ కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి :

majili-movie-review1

నైజాం – 5.26 కోట్లు
సీడెడ్ – 1.96 కోట్లు
వైజాగ్ – 1.93 కోట్లు

majili-movie-review2
ఈస్ట్ – 0.86 కోట్లు
కృష్ణా – 1.00 కోట్లు
గుంటూర్ – 1.24 కోట్లు

majili-movie-review3
వెస్ట్ – 0.65 కోట్లు
నెల్లూరు – 0.37 కోట్లు
———————————————
ఏపీ +
తెలంగాణ – 13.27 కోట్లు

majili-movie-review4

రెస్ట్ ఆఫ్
ఇండియా – 1.75 కోట్లు
ఓవర్సీస్ – 2.35 కోట్లు
———————————————-
వరల్డ్ వైడ్ టోటల్ – 17.37 కోట్లు (షేర్)
————————————————-

ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ 22 కోట్లు జరిగింది. ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి 17.37 కోట్ల షేర్ ను రాబట్టింది. అయితే ఈ రోజు నుండీ ఈ చిత్రానికి అసలైన పరీక్ష మొదలుకానుంది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 5 కోట్ల వరకూ రాబట్టాల్సి ఉంది. ఈ మూడు రోజుల్లోనే ఈ చిత్రం 5 కోట్లు రాబట్టాల్సి ఉంది. ఎందుకంటే గురువారం రోజున ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరుగనుండడం ఈ చిత్ర కలెక్షన్ల పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక ఏప్రిల్ 12 (శుక్రవారం) నుండే తేజు ‘చిత్రలహరి’ సినిమా విడుదల కాబోతుంది. ఆ చిత్రం పై కూడా మంచి క్రేజ్ ఉంది. మరి ఈ చిత్రం మొదటి వారం పూర్తయ్యేసరికి ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.

majili-movie-first-weekend-collections1

Share.