‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ ఎలా ఉండబోతుందంటే..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ అభిమానులకు ఇది స్పెషల్ డే. ఎందుకంటే ఈరోజు(నవంబర్ 22) ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ విడుదల కాబోతుంది. అభిమానులు అంతా ఎంతో ఆసక్తితో సాయంత్రం 5 గంటల 4 నిమిషయాలు ఎప్పుడవుతుందా అని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. తమ అభిమాన హీరోని దర్శకుడు అనిల్ రావిపూడి ఎలా చూపించబోతున్నాడు అనే క్యూరియాసిటీ వారిలో చాలా ఉంది. చాలా రోజుల తరువాత మహేష్ పక్కా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తుండడం అలాగే సుమారు 6 ఏళ్ళ తరువాత సంక్రాంతి బరిలో దిగనుండడంతో వారిలో ఉత్కంఠత మరింత పెరిగిందనే చెప్పాలి.

Sarileru Neekevvaru Teaser Will Be Out On November 22nd

ఇదిలా ఉంటే.. ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ ఎలా ఉండబోతుంది..? అనే విషయం ఫిలింనగర్ విశ్లేషకులు నుండీ కొంత సమాచారం అందింది. వారి సమాచారం ప్రకారం… టీజర్ 58 సెకండ్లు ఉంటుందని తెలుస్తుంది. ఓ డైలాగ్ తో టీజర్ మొదలవుతుందట… అలాగే డైలాగ్ తోనే టీజర్ ముగుస్తుందట. సో రెండు డైలాగులు ఉంటున్నాయని తెలుస్తుంది. ఇక దాదాపు అందరి నటీ నటులు ఈ టీజర్లో కనిపిస్తారట.. ముఖ్యంగా విజయశాంతి అలాగే హీరోయిన్ రష్మిక కనిపిస్తారట.అయితే సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న రాజేంద్ర ప్రసాద్ మాత్రం ఈ టీజర్ లో కనిపించడని తెలుస్తుంది. ఏదేమైనా ఈ టీజర్ కచ్చితంగా మహేష్ అభిమానులని ఆకట్టుకుంటుందని తెలుస్తుంది. మహేష్ మాస్ లుక్ ఎలివేషన్స్ కూడా ఓ రేంజ్లో ఉండబోతున్నాయని తెలుస్తుంది.

“జార్జ్ రెడ్డి” సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.