షాకింగ్: డ్రగ్స్ కేసులో తెరపైకి మహేశ్ బాబు భార్య నమ్రత పేరు!

సూపర్ స్టార్ మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ డ్రగ్ రాకెట్లో ఇరుక్కుందనే కథనాలు సంచలనం రేపుతున్నాయి. ఆమె పై డ్రగ్స్ ఆరోపణలు రావడంతో టాలీవుడ్ లో అందరూ షాక్ కి గురవుతున్నారు. డ్రగ్స్ ఆరోపణలు పై అరెస్ట్ కాబడిన రియా చక్రవర్తి, షోవిక్ చక్రవర్తితో నమ్రతకు కమ్యూనికేషన్ ఉందని తెలుస్తుంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ టాలెంట్ మేనేజర్ జయ సాహాతో నమ్రతకు స్నేహం ఉన్నట్లు జాతీయ మీడియాలో నిన్నటి నుండి వరుస కథనాలు రావడం జరిగింది.

నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారుల విచారణలో పాల్గొంటున్న జయ సాహా, నమ్రత పేరు ప్రస్తావించినట్లు మీడియా కథనాల సారాంశం. జయ సాహా నమ్రత గురించి ఏమి చెప్పారు, నమ్రత బాలీవుడ్ కి చెందిన హీరోయిన్ కావడంతో పాటు, అక్కడ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. లభించిన ఆధారాల నేపథ్యంలో నమ్రతను విచారణకు పిలిచే అవకాశం కలదని కొందరు భావిస్తున్నారు.

బాలీవుడ్ లో దీపికా పదుకొనె, శ్రద్దా కపూర్, సారా అలీ ఖాన్ పేర్లు వినిపిస్తున్నాయి. దీపికా పదుకొనె మేనేజర్ కి అధికారులు సమన్లు జారీ చేయగా ఈ కేసు మరిన్ని మలుపులు తిరిగేలా కనిపిస్తుంది. దీపికా కూడా విచారణలో పాల్గొనడం ఖాయం అన్న మాట వినిపిస్తుంది. అరెస్ట్ కాబడిన రియా చక్రవర్తితో పాటు మరికొందరిని అధికార్లులు విచారిస్తున్నారు. ఈ కేసులో జయా సాహా కూడా ప్రధానంగా మారారు.

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Share.