తప్పులు జరుగుతాయిలే బాబు: ఎమ్మెస్ రాజు

ఒక సినిమాకి హీరో, డైరెక్టర్, హీరోయిన్, విలన్, కమెడియన్ ఇలా చాలామంది ముఖ్యమైన వ్యక్తులు ఉంటారు. ఎలాగైతే దర్శకుడ్ని కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటామో.. అలాగే నిర్మాత అనే వ్యక్తి ఓనర్ ఆఫ్ ది షిప్ అండ్ డీజిల్ ఫర్ ది షిప్. సో షిప్ కదలాలంటే ప్రొడ్యూసర్ కంపల్సరీ. అలాంటి నిర్మాతను ఖాతరు చేయడం మానేసింది మన ఇండస్ట్రీ. ప్రొడ్యూసర్ అంటే ఏటీయం మెషీన్ అయిపోయాడు అందరికీ.

గౌరవం పక్కన పెడితే కనీస స్థాయి గుర్తింపు కూడా ఇవ్వడం లేదు నిర్మాతకి. కొత్త నిర్మాతలు మాత్రమే కాదు సీనియర్ నిర్మాతలు కూడా ఈ విషయంలో చాలా బాధపడుతున్నారు. ఇలాంటి సంఘటన నిన్న చోటు చేసుకుంది. మహేష్ బాబు కెరీర్ కి మైలురాయి లాంటి “ఒక్కడు” సినిమా విడుదలై నిన్నటికి 18 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మహేష్ బాబు తప్ప అందరూ సోషల్ మీడియా ద్వారా సంతోషం వ్యక్తం చేశారు.

నమ్రత కూడా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. అయితే.. సదరు పోస్ట్ లో నిర్మాతకు ఎమ్మెస్ రాజు పేరును ప్రస్తావించడం మరిచిపోయింది. ఈ విషయమై కాస్త బాధపడ్డారు నిర్మాత ఎమ్మెస్ రాజు. ట్విట్టర్ లో మహేష్ బాబును ట్యాగ్ చేసి “తప్పులు జరుగుతాయిలే బాబు” అంటూ ఎమ్మెస్ రాజు పెట్టిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అయ్యింది. అయితే.. మహేష్ బృందం నుంచి ఎవరూ ఎమ్మెస్ రాజు ట్వీట్ కి రెస్పాండ్ అవ్వలేదు.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.