కెజిఎఫ్ టి ఆర్ పి పైనే అందరి ద్రుష్టి..!

కొన్ని సినిమాలు సృష్టించే ప్రభంజనం అంతా ఇంతా కాదు. చాలా కాలం ప్రేక్షకుల మదిలో మెదులాడుతూనే ఉంటాయి. అలాంటి చిత్రాలలో కెజిఎఫ్ ఒకటి. ఆ సినిమా విడువులై ఏడాదిన్నర అవుతున్నా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. దీనితో రేపు స్టార్ మా లో ప్రసారం కానున్న ఆ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. హీరో యష్ ఓ ప్రత్యేక వీడియో ద్వారా తెలుగు ప్రేక్షకులు కెజిఎఫ్ చూసి ఆనందించాలని కోరుకున్నారు.

కాగా మొదటి సారి బుల్లి తెరపై ప్రసారం అవుతున్న కెజిఎఫ్ రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అని అర్థం అవుతుంది. ఐతే ఇప్పటివరకు తొలుగులో నమోదైన హైయెస్ట్ టి ఆర్ పి రేటింగ్ ని కెజిఎఫ్ క్రాస్ చేయగలదా లేదా అనే ఆసక్తి నెలకొంది. ఇక టాలీవుడ్ లో హైయెస్ట్ టి ఆర్ పి అందుకున్న చిత్రంగా సరిలేరు నీకెవ్వరు ఉంది. మహేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సంక్రాంతి కానుకగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు 23.04 టి ఆర్ పి దక్కించుకొని టాలీవుడ్ హైయెస్ట్ టి ఆర్ పి దక్కించుకున్న చిత్రంగా నిలిచింది.

Mahesh Babu vs KGF Hero Yash1

ఆ తరువాత స్థానం ప్రభాస్ బాహుబలి 2 చిత్రం ఉంది ఈ మూవీ అత్యధికంగా 22.7 టి ఆర్ పి రేటింగ్ దక్కించుకుంది. మరి భారీ అంచనాల మధ్య రేపు సాయంత్రం స్టార్ మా లో ప్రసారం కానున్న కెజిఎఫ్ మహేష్ సరిలేరు నీకెవ్వరు మూవీని బీట్ చేస్తుందా లేదా అనేది ఆసక్తి కరంగా మారింది.

Most Recommended Video

భానుమతి & రామకృష్ణ సినిమా రివ్యూ & రేటింగ్!
సినిమాల్లోకి రాకముందు మన హీరోయిన్స్ ఎలా ఉంటారో చూస్తే.. షాక్ అవ్వాల్సిందే..!
అట్టర్ ఫ్లాప్ సీజన్ అంటే ఇదేనేమో..!

Share.