కంప్రమైజ్ జరిగినా.. మహేష్ ఫ్యాన్స్ కు టెన్షన్ తప్పట్లేదు..!

మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఓ చిత్రం చేస్తున్నాడు. మరో పక్క త్రివిక్రమ్ డైరెక్షన్లో అల్లు అర్జున్ కూడా ఓ సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా 2020 సంక్రాంతికే విడుదల కాబోతున్నాయి. ఈ రెండు చిత్రాలకి మంచి క్రేజ్ ఉంది. ఈ ఏడాది ‘ఎఫ్2’ చిత్రంతో అనిల్ రావిపూడి.. ‘మహర్షి’ చిత్రంతో మహేష్ హిట్లందుకుని మంచి ఫామ్లో ఉన్నారు. ఇక అల్లు అర్జున్, త్రివిక్రమ్ లది కూడా సూపర్ హిట్ కాంబినేషన్ అన్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ‘జులాయి’ ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. సో వీళ్ళది ప్రూవ్డ్ కాంబినేషన్ కాబట్టి ప్రేక్షకులు ఎక్కువగా ఈ చిత్రం గురించే ఆసక్తిగా ఉన్నారు. ఈ చిత్రానికి ‘అలా వైకుంఠపురంలో’ అనే టైటిల్ ను అనుకుంటున్నారు.

mahesh-babu-vs-allu-arjun1

ఇక తాజా సమాచారం ప్రకారం… మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని జనవరి 10 న విడుదల తేదీని ఫిక్స్ చేయబోతున్నారట. ఇక బన్నీ, త్రివిక్రమ్ చిత్రాన్ని జనవరి 14 న విడుదల చేయిస్తారని తెలుస్తుంది. ఇప్పుడు ఈ విషయంలో మహేష్ ఫ్యాన్స్ టెన్షన్ తో ఉన్నారు. 2014 లో వచ్చిన మహేష్ ‘1 నేనొక్కడినే’ చిత్రం కూడా జనవరి 10 నే విడుదలై డిజాస్టర్ గా మిగిలింది. ఇప్పుడు మళ్ళీ ఇదే డేట్ కి ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని విడుదల చేయడం వారిని కలవరపెడుతుంది. అయితే రెండు చిత్రాల నిర్మాతలు సమావేశమై ఈ డేట్లు ఫిక్స్ చేసుకున్నారట. జనవరి 14 న విడుదలయ్యే సినిమాకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా… జనవరి ఎండింగ్ వరకూ ఆ సక్సెస్ జర్నీ కొనసాగుతూనే ఉంటుంది. ఏమైనా బన్నీకి ఫేవర్ జరిగిందనే చెప్పాలి.

Share.