సంక్రాంతి సినిమాలకి అసలు పరీక్ష అక్కడే..?

2020 సంక్రాంతికి బాక్సాఫీస్ షేకవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే భారీ సినిమాలు ఆ సీజన్ కి కుర్చీఫ్ వేసుకుని కూర్చున్నాయి. కానీ అందరి దృష్టి మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, అలాగే అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ చిత్రాలపైనే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం నిర్మాతలు థియేటర్స్ ని హోల్డ్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇక్కడ ఈ రెండు చిత్రాలకి పెద్ద ప్రాబ్లెమ్ లేదు. కానీ ఓవర్సీస్ లో మాత్రం ఈ రెండు చిత్ర టీం లు అస్సలు తగ్గడం లేదు. ఎందుకంటే పండగ మంగళవారం వచ్చింది.. అక్కడ ‘వన్ ప్లస్ వన్’ ఆఫర్ ఉండే అవకాశం ఉంది కాబట్టి కలెక్షన్లు ప్రీమియర్స్ కే 1 మిలియన్ పైనే వసూళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది.

mahesh-babu-vs-allu-arjun-for-sankranthi-race1

అంటే 2 కోట్ల పైనే అన్న మాట. దీంతో జనవరి 10 డేట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. మహేష్ బాబు తో పోలిస్తే అల్లు అర్జున్ సినిమాలకు ఓవర్సీస్ లో మార్కెట్ తక్కువే..! కానీ దర్శకుడు త్రివిక్రమ్ సినిమాలకి అక్కడ మంచి మార్కెట్ ఉంది కాబట్టి పెద్ద పోటీ నెలకొంది.అంతేకాదు మధ్యలో రజినీకాంత్ ‘దర్బార్’ సినిమా కూడా ఉంటుంది. ఆ సినిమా కూడా గట్టి పోటీ ఇవ్వడం ఖాయం. కాబట్టి జనవరి 10 కి ఏ సినిమా విడుదలవుతుంది అనే దానిపై ఆసక్తి నెలకొంది.

Share.