ఆ విషయంలో ముందడుగు వేస్తున్న మహేష్ బాబు?

దాదాపు రెండు నెలలు పై నుండే షూటింగ్ లు నిలిచిపోయాయి. విడుదలకు సిద్ధపడుతున్న సినిమాలతో షూటింగ్ లు చివరి దశలో ఉన్న సినిమాల షూటింగ్ లు కూడా ఆగిపోయాయి. అయితే షూటింగ్ జరుపుకోవడానికి ప్రభుత్వానికి మన టాలీవుడ్ పెద్దలు రిక్వెస్ట్ లు పెడుతున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఈ విషయం పై నిన్న మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో టాలీవుడ్ పెద్దలందరూ కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో ముచ్చటించారు.

త్వరలోనే దీనికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటామని కూడా ఆయన తెలిపారు. అయితే ఈ లోపు రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్ ‘ షూటింగ్ ను తక్కువ మందితో ప్లాన్ చేసి.. వర్కౌట్ అయితే మిగిలిన మేకర్స్ కు కూడా పెర్మిషన్ ఇప్పించాలని టాలీవుడ్ పెద్దలు కోరినట్టు కూడా తెలుస్తుంది. ఆ రకంగా చూస్తే ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ ప్రారంభించే మొదటి సినిమా అవుతుంది. అయితే అంతకు ముందే మహేష్ బాబు బోణి కొట్టబోతున్నట్టు తెలుస్తుంది.

వివరాల్లోకి వెళితే.. మహేష్ బాబు ఇప్పుడు పరశురామ్(బుజ్జి) డైరెక్షన్లో ఓ చిత్రం చెయ్యబోతున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టిన రోజు అయిన మే 31న ఈ చిత్రం లాంచ్ కానుంది. అతి తక్కువ మంది సమక్షంలో ఈ చిత్రాన్ని లాంచ్ చెయ్యనున్నారు. అంతేకాదు మార్నింగ్ టైంలోనే చిన్న సీన్ ను కూడా చిత్రీకరిస్తారట. సెంటిమెంట్ ప్రకారం పూజా కార్యక్రమానికి మహేష్ బాబు హాజరుకాడట. ఆ రోజే ముహూర్తపు షాట్ ను చిత్రీకరిస్తారు కాబట్టి.. షూటింగ్ లు మళ్ళీ మహేష్ బాబు సినిమా తోనే మొదలుకాబోతున్నట్టు స్పష్టమవుతుంది.

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Share.