Mahesh Babu: సోనూతో పూరి ప్లాన్ ఇదే!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గతంలో మహేష్ బాబుతో కలిసి ‘పోకిరి’, ‘బిజినెస్ మెన్’ లాంటి సినిమాలను రూపొందించారు. ‘పోకిరి’ సినిమా మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ‘బిజినెస్ మెన్’ కూడా మహేష్ ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకుంది. అప్పటినుండి మహేష్ తో మరో సినిమా చేయాలనుకుంటున్నాడు పూరి జగన్నాథ్. ఈ క్రమంలో వీరి కాంబినేషన్ లో ‘జనగణమన’ అనే సినిమా అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. కానీ ఈ సినిమా నుండి మహేష్ డ్రాప్ అయ్యాడు. అప్పటినుండి ఆ కథ అలానే ఉంది.

ఎప్పటికైనా.. ఆ సినిమాను మహేష్ తోనే చేయాలని అనుకున్నాడు పూరి. కానీ ఆ తరువాత ‘జనగణమన’ కథ గురించి చాలా వార్తలు వచ్చాయి. పవన్ తో ఈ సినిమా ఉంటుందని అన్నారు. రీసెంట్ గా ‘కేజీఎఫ్’ స్టార్ యష్ తో పూరి ఈ సినిమా చేయబోతున్నాడని అన్నారు. కానీ పూరి ఆలోచన మరోలా ఉందని తెలుస్తోంది. ‘జనగణమన’ కథను వీలైనంత త్వరగా తెరపై చూసుకోవాలని పూరి భావిస్తున్నాడు. ఈ కథను సోనూసూద్ తో చేయాలని ప్లాన్ చేస్తున్నాడట.

ప్రస్తుతం సోనూకి రియల్ హీరో ఇమేజ్ ఉంది. దేశవ్యాప్తంగా తన మంచి పనులు, సేవలతో గుర్తింపు సంపాదించుకున్నాడు. అతడైతే ఈ కథకు బాగుంటుందని పూరి అనుకుంటున్నాడు. పైగా సోనూకి పూరికి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. పూరి తన సినిమాల్లో సోనూసూద్ కి మంచి రోల్స్ ఇచ్చాడు. అదే అనుబంధంతో సోనూకి కథ చెప్పబోతున్నాడు పూరి. కథ నచ్చితే గనుక కచ్చితంగా వీరి కాంబినేషన్ లో సినిమా వస్తుందని అంటున్నారు.

Most Recommended Video

వకీల్ సాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!
జాతి రత్నాలు, ఉప్పెన, క్రాక్..ఇలా బాలీవుడ్ కు చాలానే వెళ్తున్నాయి..!

Share.