సల్మాన్, రజిని రేంజ్ లో మహేష్..!

టాలీవుడ్ లో మహేష్ అతిపెద్ద ఫ్యాన్ బేస్ కలిగిన హీరో అనడంలో ఎటువంటి సందేహం లేదు. యూత్, లేడీస్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చిన హీరో మహేష్. మహేష్ కున్న క్రేజ్ రీత్యా అనేక అంతర్జాతీయ మరియు జాతీయ వాణిజ్య ఉత్పత్తులకు ప్రచార కర్తగా వ్యవహరిస్తున్నారు. అలాగే టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరో కూడా మహేషే కావడం విశేషం. ఆయన నటించిన గత రెండు చిత్రాలు భరత్ అనే నేను, మహర్షి సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక తాజా మూవీ సరిలేరు నీకెవ్వరు రికార్డు వసూళ్లు సాధిస్తుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 101కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్టు చిత్ర యూనిట్ తెలియజేసింది.

Sarileru Neekevvaru Movie Review1

కాగా సరిలేరు నీకెవ్వరు కొరకు మహేష్ రెమ్యూనరేషన్ తెలిస్తే మైండ్ బ్లాక్ కావాల్సిందే. సరిలేరు నీకెవ్వరు చిత్రానికి రెమ్యూనరేషన్ గా మహేష్ నాన్ థియరిటికల్ రైట్స్ తీసుకోవడం జరిగింది. సరిలేరు నీకెవ్వరు చిత్ర నాన్ థియరిటికల్ రైట్స్ 49కోట్లకు అమ్ముడుబోవడం జరిగింది. ఈ లెక్కన మహేష్ సరిలేరు నీకెవ్వరు చిత్రానికి 49కోట్లు తీసుకున్నారన్న మాట. దీని ప్రకారం టాలీవుడ్ లో ఏ హీరో కూడా మహేష్ దరిదాపుల్లో కూడా లేరు. మహర్షి చిత్రానికి 20కోట్ల పారితోషికం అందుకున్న మహేష్ ఈ చిత్రం కోసం రెట్టింపుకు పైగా రెమ్యూనరేషన్ అందుకున్నారు. ఇక మహేష్ ఈ చిత్ర నిర్మాణ భాగస్వామిగా కూడా ఉన్నాడని తెలుస్తుంది. మరి సినిమా లాభాలలో కూడా మహేష్ కి వాటా రావాలి. ఇలా మహేష్ సరిలేరు నీకెవ్వరు చిత్రంతో రజిని, సల్మాన్ వంటి హీరోల సరసన చేరాడు.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Share.