మహేష్- పూరి కాంబోలో హ్యాట్రిక్ మూవీ ఫిక్స్..!

మహేష్ – పూరి … ఈ కాంబోకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. దానిని ప్రత్యేకంగా వర్ణించనవసరం లేదు. వీరి కాంబినేషన్ లో వచ్చిన గత చిత్రాల ఫలితాలే చెబుతాయి. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన పోకిరి ఇండస్ట్రీ హిట్ అయితే.. బిజినెస్ మెన్ చిత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది. అంతే కాదు ఈ రెండు చిత్రాల్లోనూ మహేష్ ఆటిట్యూడ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అందుకే వీరి కాంబో లో మళ్లీ సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచస్తున్నారు.

అయితే మధ్యలో వీళ్ళ మధ్య మనస్పర్థలు వచ్చాయని ఓ సందర్భంలో ప్రూవ్ అయ్యింది. అలా అని పూరి ని.. మహేష్ పూర్తిగా దూరం పెట్టలేదు. కచ్చితంగా పూరి మంచి కథతో వస్తే సినిమా చెయ్యడానికి నేను రెడీ అని సోషల్ మీడియాలో తెలిపాడు. అయితే మేము చెయ్యబోయే మూడో చిత్రం… పోకిరి, బిజినెస్ మెన్ లను మించే ఉండాలి తప్ప .. తగ్గకూడదు అని కూడా మహేష్ తెలిపాడు. ఈ నేపథ్యంలో జన గణ మన కథను మహేష్ రిజెక్ట్ చేశాడని వార్తలు వచ్చాయి.

Mahesh Babu Fans Wating For Puri Jagannadh combo1

అయితే తాజా సమాచారం ప్రకారం మహేష్.. పూరి వినిపించిన కథకు ఒకే చెప్పేశాడట. అయితే అది జన గణ మన స్క్రిప్టా కదా అన్నది తెలియాల్సి ఉంది. ఏమైనా పూరి – మహేష్ ల మూవీ 2021 లో పక్కా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ అయితే ఉండట.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Share.