పోగొట్టుకున్న చోటనే వెతుక్కుంటున్న మహేష్ బాబు..!

అవును మహేష్ బాబు పోగొట్టుకున్న చోటనే వెతుక్కుంటున్నాడట. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడంటే వరుసగా కమర్షియల్ సినిమాలు చేస్తున్నాడు మహేష్ బాబు. గతంలో ఎన్నో ఎక్స్పెరిమెంట్ సినిమాలు చేసి చేతులు కాల్చుకున్న మహేష్ ఇప్పుడు కాన్సెప్ట్ తో మరియు మెసేజ్ ఓరియెంటెడ్ తో కూడుకొన్న కమర్షియల్ సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో ‘భరత్ అనే నేను’ ‘మహర్షి’ ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి హ్యాట్రిక్ హిట్లు అందుకున్నాడు.

Mahesh Babu With Vamsi Paidipally

ఇప్పుడు తన తరువాతి చిత్రాన్ని వంశీ పైడిపల్లి డైరెక్షన్లో చేయడానికి రెడీ అవుతున్న మహేష్… ఈ చిత్రం లో ‘స్పై’ గా కనిపించబోతున్నట్టు సమాచారం. గతంలో ‘స్పైడర్’ సినిమాలో కూడా ఆ పాత్ర చేసాడు. కాని ఆ చిత్రం పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఈసారి మాత్రం అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలా … జాగ్రత్త పడుతున్నాడని సమాచారం. ఏమైనా మహేష్ గట్స్ కు మెచ్చుకోవాల్సిందే..!

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Share.