మహేష్ వంశీకి హ్యాండిచ్చి ఆ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడా..?

మహేష్ దర్శకుడు వంశీ పైడిపల్లి మూవీని ప్రక్కన పెట్టిన నేపథ్యంలో ఆయన మరి ఏ దర్శకుడితో చేస్తారు అనే ఆసక్తి ఫ్యాన్స్ తో పాటు సగటు సినీ ప్రేమికులలో నెలకొంది. కాగా మహేష్ కొద్దికాలంగా తన డేట్స్ కొరకు ఎదురుచూస్తున్న దర్శకుడు పరుశురాం ని ఎంపిక చేశారని వస్తున్న సమాచారం. పరుశురాం స్క్రిప్ట్స్ మహేష్ ని అమితంగా ఆకట్టుకోవడంతో అతనితో సినిమా చేయడానికి అంగీకరించాడని వినికిడి. గీత గోవిందం మూవీ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత పరుశురాం మహేష్ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేసి ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు చిత్రానికి ముందు మహేష్ పరుశురాం తో మూవీ చేయనున్నాడనే వార్తలు వచ్చాయి.

ఈ సారి మహేష్ తో పరుశురాం మూవీ సెట్ చేశాడని తెలుస్తుంది. గీత గోవిందం విడుదలై ఇప్పటికి ఏడాదిన్నర అవుతుంది. ఇంత వరకు పరుశురాం వేరే హీరోతో మూవీ ఒప్పుకోలేదు. ఇక పరుశురాం-మహేష్ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో నిర్మిస్తున్నారట. దీనిపై స్పష్టమైన ప్రకటన లేకున్నప్పటికీ టాలీవుడ్ లో ప్రముఖంగా వినిపిస్తుంది. ఇదే కనుక నిజం అయితే పరుశురాం ఇన్నాళ్ల నిరీక్షణకు మంచి ఫలితం దక్కినట్లవుతుంది. ప్రస్తుతం మహేష్ ఓ యాడ్ షూటింగ్ కొరకు ముంబై వెళ్లారు.

Most Recommended Video

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.