సక్సెస్ ఫుల్ కాంబినేషన్ నే రిపీట్ చేస్తున్న మహేష్ ..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 11 న విడుదలై సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. చాలా రోజుల తర్వాత మహేష్ పక్కా మాస్ సినిమా చేసాడు కాబట్టి ఆయన అభిమానులు, మాస్ ప్రేక్షకులు రిపీటెడ్ గా ఈ సినిమాని చూస్తున్నారు. విడుదలైన 6 రోజుల్లోనే ఈ చిత్రం 90 కోట్ల పైనే షేర్ ను నమోదు చేసింది.

Mahesh Babu With Vamsi Paidipally

మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన ‘మహర్షి’ కలెక్షన్స్ ను కూడా ఈ చిత్రం అధిగమిస్తుంది అనడంలో సందేహం లేదు. ఏదేమైనా ఈ చిత్రంతో మహేష్ హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నాడు. ఇక ఈ చిత్రం తర్వాత మహేష్ వంశీ పైడిపల్లి డైరెక్షన్లో సినిమా చేయబోతున్నాడు. అది పూర్తయ్యాక మరోసారి అనిల్ రావిపూడి డైరెక్షన్లో సినిమా చేస్తాడట. ఏమైనా మహేష్ సినిమాల లైనప్ బాగుందనే చెప్పాలి.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Share.