మహేష్ సినిమా ఆగిపోవడానికి అసలు కారణం అదే..!

అవును.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ఆగిపోయిందట. అయితే అది ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా కాదండోయ్…! ఈ చిత్రానికి ఎలాంటి సమస్యలు లేవు. 2020 సంక్రాంతికే ఈ చిత్రం విడుదల చేసేలా దర్శకుడు అనిల్ రావిపూడి పక్కా ప్లాన్ చేసుకున్నాడు. అయితే.. మహేష్ సినిమా ఏది.. ఆగిపోయింది.. అనేగా మీ డౌట్? విషయం ఏమిటంటే.. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం పూర్తయిన వెంటనే పరుశురామ్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తాడని అంతా అనుకున్నారు. పరశురామ్ వినిపించిన కథకి మహేష్ కూడా ఓకే చెప్పాడట. అది మహేష్ కూడా నచ్చిందని చెప్పాడట. ఈ ప్రాజెక్ట్ ను ‘గీత ఆర్ట్స్’ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తాడని కూడా ప్రచారం జరిగింది.

director sri hari,koratala, Director Koratala Siva, mahesh babu,mahesh 24

కానీ డేట్స్ కుదరక పోవడంతో ఇప్పుడు మహేష్ ఆ ప్రాజెక్ట్ ను సెట్స్ పైకి తీసుకెళ్ళే పరిస్థితి లేదంట. ఇక తరువాత వంశీ పైడిపల్లి సినిమా చేస్తాడని కూడా ప్రచారం జరిగింది. అయితే మధ్యలో త్రివిక్రమ్ ఈ మధ్యే మహేష్ ను కలిసి ఓ కథ చెప్పాడట. ఎన్నో సంవత్సరాలుగా వీరి మధ్య కదా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇప్పటి వరకూ మహేష్ ఏ స్క్రిప్ట్ ని ఓకే చేయలేదు. కానీ ఈ సారి మాత్రం పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యాడట. ఫుల్ స్క్రిప్ట్ తీసుకొచ్చి వినిపించమనిచెప్పాడట. దీంతో దర్శకుడు కొరటాల శివకి పరశురామ్ తో సినిమా చేయడం ఇప్పట్లో కుదరక పోవచ్చు అని చెప్పాడట. దీంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే టాక్ బలంగా వినిపిస్తుంది.

Share.