తండ్రి కొడుకులకు ఆగస్టు అలా కలిసొచ్చిందట!

పరిశ్రమలో సెంటిమెంట్ అనేది చాల ముఖ్యం. హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఈ సెంటిమెంట్ ఫాలో అవుతూ ఉంటారు. హీరోయిన్స్, కాంబినేషన్స్ కూడా ఈ సెంటిమెంట్ లో భాగాలే. టైటిల్స్ లో అక్షరాల దగ్గర నుండి, పదాలు, విడుదల తేదీ అన్నీ కన్సిడరేషన్ లోకి వస్తాయి. కాగా మహేష్ ఫ్యామిలీకి ఆగస్టు నెల బాగా అచ్చొచ్చిన నెల అట. మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ ఆగస్టు లో విడుదల చేసిన చిత్రాలు భారీ విజయాలు అందుకున్నాయట. అందుకు కృష్ణ, మహేష్ నటించిన చిత్రాలు ఆగస్టు లో విడుదలై ఘనవిజయం సాధించిన కొన్ని చిత్రాలు చెప్పుకోవచ్చు.

1961 ఆగస్టు 11న విడుదలైన గూఢచారి 116 భారీ విజయం అందుకుంది. తెలుగులో వచ్చిన మొదటి స్పై చిత్రం కావడం విశేషం. ఇక 1971 ఆగస్టు 27న విడుదలైన మోసగాళ్లకు మోసగాడు ఓ ట్రెండ్ సెట్టింగ్ మూవీగా నిలిచింది. ఇది ఇండియాలో తెరకెక్కిన మొదటి కౌ బాయ్ చిత్రం. ఆగస్టు 9, 1973న వచ్చిన దేవుడు చేసిన మనుషులు భారీ విజయం అందుకుంది. ఇది ఎన్టీఆర్ తో కృష్ణ కలిసి చేసిన మల్టీస్టారర్. ఆగస్టు 14, 1991లో వచ్చిన ఎన్కౌంటర్ మూవీ కూడా మంచి విజయాన్ని నమోదు చేసింది.

Mahesh Babu Krishna Movies which are released in august1

ఇక తండ్రి వారసత్వాని కొనసాగిస్తూ మహేష్ సైతం ఆగస్టు లో మరపురాని విజయాలు నమోదు చేశారు. 18 ఆగస్టు 2004లో వచ్చిన అర్జున్ మూవీ 100రోజులు ఆడింది. ఆ తదుపరి ఏడాది అనగా 2005 ఆగస్టు 10న విడుదలైన అతడు మహేష్ ఆల్ టైం ఫేవరేట్ చిత్రాలలో ఒకటిగా నిలిచిపోయింది. ఇక కొరటాల శివ దర్శకత్వంలో 2015 ఆగస్టు 10న విడుదలైన శ్రీమంతుడు ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఆ విధంగా కృష్ణ మరియు మహేష్ లకు ఆగస్టు కలిసి వచ్చింది.

Most Recommended Video

నిహారిక-చైతన్య నిశ్చితార్ధ వేడుకలో మెగాహీరోల సందడి..!
మన తెలుగు సినిమాలు ఏవేవి బాలీవుడ్లో రీమేక్ అవ్వబోతున్నాయంటే?
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Share.