ఎన్టీఆర్ నుండీ మహేష్ వద్దకు వెళ్ళిన క్రేజీ డైరెక్టర్ సినిమా..!

ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఈ చిత్రంలో రాంచరణ్ కూడా మరో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడు అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ క్రమంలో త్రివిక్రమ్ పేరు ఎక్కువగా వినిపించింది. కానీ ‘మైత్రి మూవీ మేకర్స్’ నిర్మాణంలో ‘కె.జి.ఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కూడా ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నట్టు కూడా వార్తలు వచ్చాయి.

Mahesh Babu Jr NTR

అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మహేష్ బాబు వద్దకు వెళ్లిందని తాజా సమాచారం. మహేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్లో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ చిత్రం తర్వాత మహేష్ ఏ డైరెక్టర్ కు ఇంకా కమిట్ అవ్వలేదు. ఇక గత 2,3 నెలలుగా ప్రశాంత్ నీల్ మహేష్ చుట్టూనే తిరుగుతున్నాడు. దీంతో వీరి మధ్య స్టోరీ డిస్కషన్లు జరుగుతున్నాయని సమాచారం. ‘మైత్రి మూవీ మేకర్స్ ‘ సంస్థలోనే ఈ చిత్రం కూడా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లోనే ఉండబోతుందని సమాచారం.

రాజుగారి గది 3 సినిమా రివ్యూ & రేటింగ్!
ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.