18 ఏళ్ల తర్వాత మళ్ళీ కలిసిన నిజం కాంబో

కొన్ని సినిమాలు ఫ్లాపయినా, సదరు సినిమా కాంబినేషన్స్ ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతాయి. అలాంటి ఒక అరుదైన కాంబినేషన్ మహేష్ బాబు-గోపీచంద్. “నిజం” సినిమాలో వీరిద్దరి కాంబినేషన్ చూడడానికి క్రేజీగా ఉంటుంది. 18 ఏళ్ల క్రితమే పెద్ద సంచలనం సృష్టించిన కాంబినేషన్ అది. అదే కాంబినేషన్ ఇప్పుడు తెరపై మళ్ళీ రిపీట్ అయితే రచ్చ మాములుగా ఉండదు. అయితే.. గోపీచంద్ మళ్ళీ విలన్ గా నటించడం అనేది ఇప్పట్లో జరిగే పని కాదు కానీ..

నిన్న సంక్రాంతికి టాలీవుడ్ హీరోలందరూ ఒక చోట చేరారు. మెగా ఫ్యామిలీ, సూపర్ స్టార్ ఫ్యామిలీ, మంచు ఫ్యామిలీ హీరోలందరూ కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొన్న మహేష్ బాబు హెయిర్ స్టైల్ ఒక హాట్ టాపిక్ గా నిలవగా.. అదే వేడుకలో మహేష్ బాబు, గోపీచంద్ కలిసి ఫోటోలకు ఫోజులివ్వడం మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికీ “నిజం” రోజులు జ్ఞప్తికి తెచ్చింది. సీతారాంతో దేవుడు కాంబినేషన్ ఇప్పుడు పడితే “మాస్టర్”లో విజయ్ & విజయ్ సేతుపతి రేంజ్ కి మించిపోతుందని మహేష్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మహేష్ బాబు ప్రస్తుతం సర్కార్ వారి పాట షూటింగ్ ఎప్పుడు మొదలెడతాడా అని అభిమానులతోపాటు దర్శకనిర్మాతలు కూడా వెయిట్ చేస్తున్నారు. బాబు షూటింగ్ మొదలెడితే అప్డేట్స్ వస్తాయని అభిమానుల ఆత్రం. అయితే.. నమ్రత ఆ లోటును తన సోషల్ మీడియా అప్డేట్స్ తో తీర్చేస్తోంది.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.