ఫ్లాప్ సినిమా తీసి.. ఫ్యాన్స్ ను కెలికి ఏం సాదిద్దాం అని

“కల్కి” సినిమా మరో రెండు రోజుల్లో విడుదల అనగా రాజశేఖర్ నాగలి పట్టుకొని నడుచుకొంటూ వచ్చే పోస్టర్ ను దర్శకుడు ప్రశాంత్ వర్మ షేర్ చేస్తూ.. “చాలా అవసరమైన నాగలి పోస్టర్” అని ట్వీట్ చేశాడు. మనోడు నిజంగా మహేష్ బాబును టార్గెట్ చేశాడో లేదో తెలియదు కానీ.. మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం ప్రశాంత్ వర్మ మీద విరుచుకుపడ్డారు. దానికి మన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ వివరణ ఇవ్వడానికి ప్రయత్నించి, వేరే ఇంటర్వ్యూల్లో “నా ఫేవరెట్ హీరో మహేష్ బాబు” అని చెప్పినప్పటికీ ఫ్యాన్స్ విడిచిపెట్టలేదు.

prasanth-varma-unnecessary-tweet-war-with-mahesh-babu-fans1

prasanth-varma-unnecessary-tweet-war-with-mahesh-babu-fans2

ఇక నిన్న విడుదలైన “కల్కి” చిత్రానికి నెగిటివ్ టాక్ తోపాటు రివ్యూలు కూడా రావడంలో మహేష్ కొందరు కూడబలుక్కొని కల్కి మీద దుష్ప్రచారం మొదలెట్టారు. దాంతో ప్రశాంత్ వర్మ మళ్ళీ వాళ్ళని క్షమించమని ఇండైరెక్ట్ గా అడిగినప్పటికీ పెద్దగా ఉపయోగం లేకపోయింది. అసలే రాజకీయంగా రాజశేఖర్ & ఫ్యామిలీకి మెగా ఫ్యాన్స్ కి పడదు. ఇప్పుడు కొత్తగా మహేష్ ఫ్యాన్స్ ను కెలుక్కోవడం వలన.. ట్విట్టర్ లో అటు మహేష్ ఫ్యాన్స్, ఇటు మెగా ఫ్యాన్స్ కలిపి ఒక ఆట ఆడుకొంటున్నారు. అందుకే అనేది నోరు మంచిదైతే.. ఊరు మంచిదవుతుందని.

Share.