ఫ్లాప్ సినిమాల సినిమాటోగ్రాఫర్ ఎందుకని గగ్గోల పెడుతున్న ఫ్యాన్స్

సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ప్లే చేసే మ్యాజిక్ గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. ఒక్కోసారి కాంబినేషన్స్ కంటే సెంటిమెంట్స్ కే ఎక్కువ వేల్యూ ఇస్తుంటారు. కొన్ని కాంబినేషన్స్ రిపీట్ అవుతున్నాయంటే అభిమానులు ఎంత ఆనందపడతారో.. అదే తరహాలో కొన్ని కాంబినేషన్స్ విషయంలో తెగ భయపడిపోతారు. ఇప్పుడు ఈ రెండో రకమైన ఎమోషన్ అనగా భయానికి లోనవుతున్నారు మహేష్ బాబు అభిమానులు.

mahesh-babu-fans-feeling-tensed-about-cinematographer1

మహేష్ 26వ సినిమాగా తెరకెక్కుతున్న “సరిలేరు నీకేవ్వరు” సినిమా మహేష్ ఫ్యాన్స్ కు చాలా ప్రత్యేకం. వరుసగా నాలుగు హిట్లు కొట్టిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెట్స్ కి వెళ్లడానికంటే ముందే భారీ అంచనాలు నమోదయ్యాయి. ముఖ్యంగా మహేష్ ఈ సినిమా కోసం మొట్టమొదటిసారిగా ఆర్మీ మేజర్ గా నటించడం భీభత్సమైన హైప్ క్రియేట్ చేసింది.

mahesh-babu-fans-feeling-tensed-about-cinematographer2

అయితే.. ఇప్పుడు ఈ సినిమాకి రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా జాయినవ్వడం మహేష్ అభిమానులను కలవరపెడుతోంది. ఇదివరకూ రత్నవేలు-మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన “ఒన్ నేనొక్కడినే, బ్రహ్మోత్సవం” చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ ఫ్లాప్ లుగా మిగిలిపోవడంతో ఇప్పుడు “సరిలేరు నీకేవ్వరు”కి ఆ సెంటిమెంట్ ఎక్కడ రిపీట్ అవుతుందో అని భయపడుతున్నారు. మరి ఏమవుతుందో తెలియాలంటే సంక్రాంతి వరకూ వెయిట్ చేయాల్సిందే.

Share.