విడుదలకు ముందే పోటీ రసవత్తరంగా..!

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల అవుతున్న రెండు పెద్ద చిత్రాల మధ్య తీవ్ర పోటీనెలకొని ఉంది. మహేష్, బన్నీ నటించిన సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో చిత్రాలు ఒక రోజు వ్యవధిలో బాక్సాఫీస్ వద్ద పోటీపడనున్నాయి. జనవరి 11న సరిలేరు నీకెవ్వరు విడుదల అవుతుండగా..ఆ నెక్స్ట్ డే 12న అల వైకుంఠపురంలో విడుదల అవుతుంది. ఈ రెండు చిత్రాలలో కామన్ పాయింట్ ఎంటర్టైన్మెంట్ అండ్ యాక్షన్. ఈ రెండు చిత్రాల విడుదల తేదీల విషయంలో కూడా కొంత వివాదం నడిచింది. మహేష్, బన్నీలు అసలు తగ్గేది లేదు అన్నట్లుగా ముందుకు వెళ్లారు. రెండు సినిమాలు ఒకే రోజు రావడం అటు నిర్మాతలకు, ఇటు డిస్ట్రిబ్యూటర్స్ కి నష్టం కలిగించే అవకాశం కలదు. దీనితో ఇండస్ట్రీ పెద్దల చొరవతో ఇద్దరు రాజీ కావలసివచ్చింది.

Movie Ticket Prices Hiked for Sankranthi Releases 2020

ఈ పరిణామాల నేపథ్యంలో మహేష్, బన్నీ మధ్య ఇన్నర్ కోల్డ్ వార్ గట్టిగానే నడుస్తుంది. రెండు చిత్రాల దర్శకులు మరియు హీరోలు విజయం పై సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఐతే చిత్ర విడుదలకు ముందే యూ ట్యూబ్ లో ఈ చిత్ర ట్రైలర్స్ పోటీపడుతున్నాయి. ఐదవ తేదీన విడుదలైన సరిలేరు నీకెవ్వరు ట్రైలర్ టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతుంది. ఇప్పటికే ఈ వీడియో 12 మిల్లియన్ వ్యూస్ దక్కించుకుంది. ఇక ఆరవ తేదీన విడుదలైన అల వైకుంఠపురంలో ట్రైలర్ యూ ట్యూబ్ ట్రెండింగ్ లో సెకండ్ పొజిషల్ లో కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఈ ట్రైలర్ 8 మిలియన్ వ్యూస్ సాధించింది. ఆ విధంగా మహేష్ బన్నీ ల సంక్రాంతి చిత్రాల ట్రైలర్స్ యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతూ పోటీని రసవత్తరంగా మారుస్తున్నాయి.

ala-vaikunthapurramloo-vs-sarileru-neekevvaru

ఇక యూఎస్ ప్రీమియర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో కూడా ఈ రెండు చిత్రాలు విశేష ఆదరణ దక్కించుకుంటున్నాయి. సాధారణంగా మహేష్ చిత్రాలకు యూఎస్ నందు మంచి డిమాండ్ ఉంటుంది. అలాగే దర్శకుడు త్రివిక్రమ్ సినిమాలను యూఎస్ ఆడియన్స్ బాగా ఇష్టపడతారు. ఈ రెండు కారణాల రీత్యా యూఎస్ అడ్వాన్స్ బుకింగ్స్ కౌంటర్ వద్ద బన్నీ, మహేష్ చిత్రాల పోటీ కొనసాగుతుంది. ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఓపెనింగ్స్, మొదటి షో టాక్ తరువాత కాలర్ ఎగరేయడానికి సిద్ధంగా ఉన్నారు.

అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Share.