సోషల్ మీడియా వాడకంలో అల్లు అర్జున్ ని మించిపోతున్న మహేష్

ఒక రెండుమూడేళ్ళ క్రితం వరకు తెలుగు హీరోల్లో సోషల్ మీడియాను గట్టిగా యూజ్ చేసుకొని.. ఆన్లైన్ ఫ్యాన్ బేస్ ను పెంచుకొన్న హీరోల్లో అల్లు అర్జున్ ప్రధాముడు. ఫేస్ బుక్, ట్విట్టర్ & ఇన్స్టాగ్రామ్ లో బన్నీకి ఉన్న ఫాలోయింగ్ చూసి మిగతా స్టార్ హీరోలు ఈర్ష్య పడేవారు. కానీ.. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఇప్పుడు ఈ సోషల్ మీడియా రేస్ లో మహేష్ బాబు ముందంజలో ఉన్నాడు. ముఖ్యంగా.. మహేష్ సోషల్ మీడియాను నమ్రత హ్యాండిల్ చేయడం మొదలెట్టినప్పట్నుండి మాత్రం మహేష్ బాబు సోషల్ మీడియా ఫాలోయింగ్ భీభత్సంగా పెరిగిపోయింది.

mahesh-babu-allu-arjun

ఇదివరకూ కేవలం తన సినిమా ప్రమోషన్స్ మరియు పండగలప్పుడు విష్ చేయడానికి మాత్రం తన సోషల్ మీడియా ఎకౌంట్స్ ను వాడే మహేష్ బాబు.. ఈమధ్య రెగ్యులర్ గా తన హాలీడే ట్రిప్ ఫోటోలను పోస్ట్ చేస్తున్నాడు. ముఖ్యంగా.. నమ్రత, సితార, గౌతమ్ లకు కూడా సపరేట్ ఎకౌంట్స్ క్రియేట్ చేసి ఘట్టమనేని అభిమానులతోపాటు తెలుగు సినిమా అభిమానులను కూడా విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. దాంతో అల్లు అర్జున్ సోషల్ మీడియా ఫాలోయింగ్ ను దాటిపోయాడు మహేష్ బాబు. మరి అల్లు అర్జున్ డిజిటల్ టీం ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకొంటుందో చూడాలి.

సైరా నరసింహారెడ్డి చిత్రంలోని పవర్ ఫుల్ డైలాగ్స్
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!

Share.