రాజమౌళి ఆలస్యం.. మహేష్ నుంచి మరో సినిమా

సర్కారు వారి పాటతో బిజీగా ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ సినిమాను దర్శకధీరుడు రాజమౌళితోనే చేస్తాడని అందరికి తెలిసిన విషయమే. అయితే అంతకంటే ముందు మరో సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మహేష్ ఒక్కసారి షూటింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అంటే చాలా కష్టపడి వర్క్ చేస్తాడని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా అనుకున్న సమయానికి పూర్తయ్యేలా దర్శకులకు మంచి బూస్ట్ ఇస్తుంటాడు.

ఇక రాజమౌళి సినిమా కంటే ముందే జెట్ స్పీడ్ లో మరో సినిమాను పూర్తి చేసే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. ఇక ఆయనతో వర్క్ చేయబోయే దర్శకుడు మరెవరో కాదు. గత ఎడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో మహేష్ కు మంచి హిట్టిచ్చిన అనిల్ రావిపూడి. ప్రస్తుతం F3 తో బిజీగా ఉన్న అనిల్ రీసెంట్ గా మహేష్ కు ఒక కథ వీనిపించినట్లు టాక్ వస్తోంది. దర్శకుడు రాజమౌళి RRR పూర్తి చేశాక మహేష్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల కోసమే ఒక ఏడాది వరకు సమయం తీసుకుంటాడట.

అందుకే మహేష్ అనిల్ తో మరో మంచి మాస్ మసాలా ఎంటర్టైన్మెంట్ కథను రెడీ చేయిస్తున్నట్లు టాక్. ఇక కుదిరితే వచ్చే ఏడాది సర్కారు వారి పాటతో పాటు అనిల్ డైరెక్షన్ లో చేయబోయే సినిమాను కూడా రిలీజ్ చేయవచ్చని తెలుస్తోంది. దిల్ రాజు ప్రొడక్షన్ లోనే ఆ సినిమా రావచ్చని సమాచారం.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Share.