మహేష్ vs పవన్.. ఫైట్ తప్పేలా లేదు

బాక్సాఫీస్ వద్ద సినిమాలు ఒక్కొక్కటిగా బాగానే వసూళ్లను అందుకుంటున్నాయి. కరోనా ప్రభావం థియేటర్స్ పై ఏ మాత్రం పడటం లేదని చాలా క్లారిటీగా అర్ధమయ్యింది. ఇక అసలైన బాక్సాఫీస్ పోరు రానున్న రోజుల్లో గట్టిగానే ఉంది. ఇక చాలా కాలం తరువాత సూపర్ స్టార్ vs పవర్ స్టార్ ఫైట్ కూడా హాట్ టాపిక్ గా మారనున్నట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు ఇటీవల మొదలయ్యాయి. ఇక పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్ లో రూపొందనున్న హిస్టారికల్ ఫిల్మ్ హరహర వీరమల్లు షూటింగ్ కూడా స్పీడ్ అందుకుంది. ఇప్పట్లో షూటింగ్స్ జోరు తగ్గేలా లేదు. ఇక రెండు సినిమాలు కూడా 2022 పొంగల్ భరిలో దిగనున్నట్లు మరోసారి టాక్ గట్టిగానే వస్తోంది. మహేష్ బాబు SVP అయితే ముందుగానే పొంగల్ ను బుక్ చేసుకుంది.

ప్రభాస్ సలార్ తో ఆ సమయానికి రావాలని అనుకున్నాడు కానీ షూటింగ్ ఆలస్యంగా మొదలవ్వడంతో సమ్మర్ కి షిఫ్ట్ అయ్యాడు. ఇక ఈ సారి పవన్ మహేష్ మధ్య బాక్సాఫీస్ ఫైట్ ఆల్ మోస్ట్ ఫిక్స్ అయినట్లే అని ఇన్ సైడ్ టాక్.

Most Recommended Video

చెక్ సినిమా రివ్యూ & రేటింగ్!
అక్షర సినిమా రివ్యూ & రేటింగ్!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Share.