5 ఏళ్ళ తరువాత ఫ్యాన్స్ తో మహేష్ చిట్ చాట్..!

2015 లో ‘శ్రీమంతుడు’ సినిమా టైము లో అభిమానులతో ముచ్చటించాడు మహేష్. మళ్ళీ 5ఏళ్ళకి .. నిన్న మళ్ళీ అభిమానులతో ముచ్చటించాడు. అయితే అప్పుడు ట్విట్టర్ లో అభిమానులతో ముచ్చటించిన మహేష్.. ఈసారి మాత్రం తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ముచ్చటించాడు. తనకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. ‘ఓవైపు వర్షం ..మరోవైపు ఫ్యాన్స్ తో ఛాటింగ్. ఇలాంటి టైము లో మిర్చిబజ్జీ, అల్లం టీ ఉంటే చాలా బాగుంటుందంటూ’ మహేష్ స్పందించాడు.

మునక్కాయ-మటన్ తనకు ఆల్ టైమ్ ఫేవరెట్ ఫుడ్ అని… ఇప్పుడు దానిని గుర్తుచేసుకుంటే నోరూరిపోతోందని’ తన స్టైల్ చెప్పాడు.’ఈ లాక్ డౌన్ అనేది నా లైఫ్ టైమ్ ఎక్స్ పీరియన్స్. ఇన్నాళ్లూ చేయలేకపోయిన చాలా పనుల్ని.. కుటుంబంతో కలిసి చేశాను. మా అబ్బాయి గౌతమ్ తో ఆన్ లైన్లో టెన్నిస్, గల్ఫ్, బేస్ బాల్ వంటివి ఆడడాన్ని బాగా ఎంజాయ్ చేశాను’ అని కూడా చెప్పాడు. ఇక పూరి జగన్నాథ్ తో సినిమా చెయ్యడానికి తానెప్పుడూ సిద్ధంగానే ఉంటానని..

Mahesh Babu about his favourite snacks1

అలాగే రాజమౌళి తో సినిమా చెయ్యడానికి కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చాడు. ఇక ‘సర్కారు వారి పాట’ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయం పై మహేష్ స్పందిస్తూ.. ‘ఇంకా ఎవ్వరినీ ఫైనల్ చెయ్యలేదు’ .. అని జవాబిచ్చాడు. ఇక ‘సర్కారు వారి పాట’ సినిమా విడుదల ఎప్పుడు ఉండొచ్చు అని ప్రశ్నించగా.. ‘ఇప్పుడున్న పరిస్థితి అంతా సెట్ అయ్యి రెగ్యులర్ షూటింగ్ మొదలైతే ఓ అవగాహన వస్తుందని.. అప్పటి వరకూ చెప్పలేనని’ తెలిపాడు.

Most Recommended Video

రన్ మూవీ రివ్యూ & రేటింగ్
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!
ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!

Share.