లూసిఫర్

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కథానాయకుడిగా మరో మలయాళ స్టార్ హీరో పృధ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ “లూసిఫర్”. గత నెల మలయాళంలో విడుదలైన ఈ చిత్రం అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకొంది. అందుకే ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో అనువదించి విడుదల చేశారు. మరి మలయాళ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకొన్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ తెలుగు ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!

lucifier-movie-review1

కథ: రాష్ట్ర ముఖ్యమంత్రి పి.కె.రాందాస్ అలియాస్ పి.కె.ఆర్ (సచిన్ కేడ్కర్) ఆకస్మిక మరణంతో తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనే విషయంలో ఉత్సుకత నెలకొంటుంది. ఆ క్రమంలో కొన్ని దుష్ట శక్తులు రంగంలోకి దిగుతాయి. రాందాస్ కుటుంబాన్ని కాపాడడమే కాక రాష్ట్ర భవిష్యత్ ను రక్షించడం కోసం రంగంలోకి దిగుతాడు స్టీఫెన్ అలియాస్ లూసిఫర్ (మోహన్ లాల్).

స్టీఫెన్ రాకతో అప్పటివరకూ బాబీ (వివేక్ ఒబెరాయ్) మరియు ఇతర పార్టీ మెంబర్స్ వేసుకున్న ప్లాన్స్ అన్నీ తారుమారు అవుతాయి. డ్రగ్ మాఫియాకి కూడా గట్టి షాక్ ఇస్తాడు స్టీఫెన్. అసలు స్టేఫెన్ అలియాస్ లూసిఫర్ ఎవరు? అతని బ్యాగ్రౌండ్ ఏమిటి? రాష్ట్ర రాజకీయాలను ఎలా శాసించాడు? అనేది “లూసిఫర్” కథాంశం.

lucifier-movie-review2

నటీనటుల పనితీరు: మోహన్ లాల్ సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్. స్టీఫెన్ పాత్రలో చాలా స్టైలిష్ గా కనిపించి.. మాస్ ఎలివేషన్ సీన్స్ & ఫైట్స్ అదరగొట్టాడు. మోహన్ లాల్ తో సమానమైన పెర్ఫార్మెన్స్ తో విలనిజాన్ని వీరలెవల్లో పండించాడు వివేక్ ఒబెరాయ్. కర్కశకుడిగా అతడి నటన ప్రశంసార్హం. మంజు వారియర్, ఇంద్రజిత్ సుకుమారన్ ఇలా ప్రతి ఒక్కరూ పాత్రలకు న్యాయం చేశారు.

lucifier-movie-review3

సాంకేతికవర్గం పనితీరు: సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ స్కోర్, ప్రొడక్షన్ వేల్యూస్ అన్నీ టాప్ లెవల్లో ఉంటాయి. కొన్ని యాక్షన్ బ్లాక్స్ & ఎపిసోడ్స్ లో కెమెరా వర్క్ ఏకంగా హాలీవుడ్ సినిమాల రేంజ్ లో ఉండడం విశేషం.పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన హరీష్ శంకర్ “గబ్బర్ సింగ్”లో పవన్ ను ఎలా చూపించాడో.. అదే స్థాయిలో మోహన్ లాల్ కి వీరాభిమాని అయిన హీరో పృధ్వీరాజ్ సుకుమారన్ దర్శకుడిగా మోహన్ లాల్ ను తారాస్థాయిలో ప్రెజంట్ చేశాడు.

చాలా భారీ కాన్వాస్ లో రాజకీయ నేపధ్యంలో కథను నడిపిన విధానం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. మధ్యలో కొన్ని ల్యాగ్ ఎపిసోడ్స్ ఉన్నప్పటికీ.. యాక్షన్ బ్లాక్స్, ఎలివేషన్ షాట్స్ పుష్కలంగా ఉన్న సినిమా కావడంతో మాస్ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు.

lucifier-movie-review4

విశ్లేషణ: మాంచి మాస్ మసాలా యాక్షన్ ఎంటర్ టైనర్ “లూసిఫర్”. మోహన్ లాల్ & పృధ్వీరాజ్ సుకుమారన్ స్టైలిష్ ప్రెజంటేషన్ కోసం హ్యాపీగా సినిమాని ఒకసారి చూడొచ్చు. ఈమధ్యకాలంలో తెలుగులో ఈ తరహా యాక్షన్ సినిమా రాలేదు కాబట్టి.. కాస్త పబ్లిసిటీ చేసి జనల్లోకి సినిమాని తీసుకెళ్లగలిగితే కలెక్షన్స్ కూడా బాగానే ఉంటాయి.

lucifier-movie-review5

రేటింగ్: 2.5/5

Share.