శేఖర్ కమ్ముల బ్రాండ్ లవ్ స్టొరీ.. టీజర్ అదుర్స్ అంతే..!

మజిలీ, వెంకీ మామ వంటి హిట్ చిత్రాలతో మళ్లీ ఫాంలోకి వచ్చాడు నాగ చైతన్య. ఇప్పుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్లో హ్యాట్రిక్ హిట్టు కొట్టడానికి రెడీ అయిపోయాడు. ఆయన హీరోగా నటించిన లవ్ స్టొరీ చిత్రం టీజర్ తాజాగా విడుదల అయ్యింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా సాయి పల్లవి నటిస్తుంది. ఇక ఈ టీజర్ ను గమనిస్తే… జీరో నుండీ వచ్చినా సర్ .. బాగా కష్ట పడతా అంటూ చైతన్య ఎంట్రీ ఉంది. ఇక సాఫ్టు వేర్ ఉద్యోగం కోసం ప్రయత్నించి విఫలమయ్యే యువతి లా హీరోయిన్ సాయి పల్లవి కనిపిస్తుంది.

మౌని… ఆ సాఫ్టు వేర్ జాబ్ వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది, జుట్టు ఊడిపోతుంది అంటూ చైతన్య చెప్పే డైలాగ్ యూత్ కు వెంటనే కనెక్ట్ అయిపోయే విధంగా ఉంది. ప్రేమ కథల్ని చాలా సున్నితంగా డీల్ చేయడంలో శేఖర్ కమ్ముల ది అంది వేసిన చెయ్యి. కాబట్టి ఈ చిత్రం కూడా సూపర్ హిట్ అయ్యేలా ఉందని ఈ టీజర్ స్పష్టంచేసింది. నిజానికి ఫస్ట్ లుక్, ఏయ్ పిల్లా అనే ఫస్ట్ సింగిల్.. లవ్ స్టొరీ పై మంచి మొదటి నుండీ మంచి హైప్ ఏర్పడేలా చేశాయి.

వాటిని లవ్ స్టొరీ టీజర్ డబుల్ చేసిందనే చెప్పాలి. ఇక శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్ల పై … కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు లు నిర్మిస్తున్నారు.యూట్యూబ్ లో హల్ చల్ చేస్తున్న ఈ టీజర్ ను మీరు కూడా ఆ లుక్ వెయ్యండి :


క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Share.