ఆసక్తిని పెంచుతున్న ‘లవ్ స్టోరీ’ కథ..!

నాగ చైతన్య గతేడాది ‘మజిలీ’ ‘వెంకీ మామ’ వంటి రెండు సూపర్ హిట్లు కొట్టి మంచి ఫామ్లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తన తరువాతి చిత్రాన్ని చేస్తున్నాడు. ‘లవ్ స్టోరీ’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ‘ఫిదా’ చిత్రంతో బౌన్స్ బ్యాక్ అయిన శేఖర్ కమ్ముల ఈసారి ‘లవ్ స్టోరీ’ అనే చిత్రం తెరకెక్కిస్తున్నాడు అంటే.. అంచనాలు పీక్స్ లోకి చేరుకోవడం ఖాయం.. అందులోనూ క్లాస్ సినిమాలకి రారాజు నాగ చైతన్య నటిస్తున్నాడు కాబట్టి .. కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం అందరిలోనూ ఏర్పడింది. అందుకు తగినట్టే ఇటీవల వచ్చిన ప్రోమోస్ అలాగే ఫస్ట్ సింగిల్ కు కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

Love Story Movie Story Out1

ఇదిలా ఉంటే.. ఈ చిత్రం కథ ఇదేనంటూ ఫిలింనగర్ లో తెగ డిస్కషన్లు నడుస్తున్నాయి. రెండు కులాల నేపథ్యంలో ఈ చిత్రం కథ ఉంటుందని… తెలుస్తుంది. ఓ ఆర్ఫనేజ్ ను నడుపుకునే అనాధగా హీరో నాగ చైతన్య కనిపిస్తాడని.. ఇక సాయి పల్లవి ఓ పెద్ద కులానికి చెందిన అమ్మాయిగా కనిపిస్తుందని తెలుస్తుంది. ఓ దశలో వీరిద్దరూ అదే విషయంలో సమస్య రావడంతో సున్నితంగా విడిపోవడానికి ట్రై చేస్తారని.. అయితే ఆ సమయంలో వీరిద్దరూ మరింత దగ్గరవుతారని.. అది ఎలా అనే పాయింట్ తోనే దర్శకుడు శేఖర్ కమ్ముల ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఈ కథను నడిపిస్తాడని తెలుస్తుంది. మరి ఈ కథలో ఎంత వరకూ నిజముందో తెలియాల్సి ఉంది.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Share.