ఈ సినిమాలు 2020ని మర్చిపోయేలా చేస్తాయట..!

మొదటి ఓవర్లోనే రెండు సిక్సర్లు పడితే.. ఆ ఇన్నింగ్స్ మొత్తం భారీ స్కోర్ నమోదవ్వడం ఖాయమని అంతా అనుకుంటారు.కానీ తరువాత ఓవర్లలో వరుస వికెట్లు పడిపోతే ఎలా ఉంటుంది? సరిగ్గా 2020.. టాలీవుడ్ కు అలాగే చేసింది. మొదటి నెలలో ‘అల వైకుంఠపురములో’ మరియు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాల రూపంలో రెండు భారీ సిక్సర్లు పడినట్టు అయ్యింది. తరువాత ‘భీష్మ’ ‘హిట్’ ‘కనులు కనులను దోచాయంటే’ వంటి ఫోర్లు,టు డి లతో ఆ ఊపుని కొనసాగించాయి. కానీ కరోనా ఎంట్రీతో మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది. కొత్త సినిమాల విడుదలకు, సినిమాల షూటింగ్ లకు బ్రేక్ వెయ్యడమే కాకుండా.. మన స్టార్లనందరినీ ఇంటికే పరిమితం చేసింది. అయితే ఇప్పుడు జనాల్లో కరోనా భయం తగ్గిందని ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రం నిరూపించింది. దాంతో 2021 లో పెద్ద పెద్ద ప్రాజెక్టులు విడుదలయ్యి బాక్సాఫీస్ ముచ్చట తీర్చాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. మళ్ళీ ఈ చిత్రాలతో ఆ ఊపు రావడం ఖాయమని అంతా అనుకుంటున్నారు. ఇంతకీ అవి ఏ ఏ చిత్రాలు.? మీరే ఓ లుక్కెయ్యండి :

1) ఆర్.ఆర్.ఆర్ :

ఎన్టీఆర్,చరణ్ వంటి ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్న ఈ చిత్రాన్ని రాజమౌళి తెరకెక్కిస్తుండడంతో.. ఎప్పుడెప్పుడు ఈ చిత్రాన్ని చూస్తామా అని దేశ,విదేశాల్లోని ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

2) కె.జి.ఎఫ్2:

ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ‘కె.జి.ఎఫ్ చాప్టర్1’ ఎటువంటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు రాబోతున్న ‘కె.జి.ఎఫ్2’ అంతకు మించి హిట్ అవుతుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.

3) రాధే శ్యామ్ :

ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ కాబట్టి.. ఈ సినిమా పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టి.. 2020ని మరిపించేలా చేస్తుందని ప్రభాస్ అభిమానులతో పాటు ఇండియా వైడ్ ప్రేక్షకులు భావిస్తున్నారు.

4) వకీల్ సాబ్ :

పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్న ఈ చిత్రం ‘బాహుబలి1’ రికార్డులను బ్రేక్ చేస్తుందని పవన్ కళ్యాణ్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

5) పుష్ప :

‘రంగస్థలం’ తరువాత దర్శకుడు సుకుమార్ అలాగే ‘అల వైకుంఠపురములో’ తరువాత అల్లు అర్జున్ చేస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమా పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రం రూపొందుతోంది.

6) ఆచార్య :

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం కూడా భారీ హిట్ అవ్వడం ఖాయమని ప్రేక్షకులు భావిస్తున్నారు.

7) సర్కారు వారి పాట :

మహేష్ బాబు హీరోగా పరశురామ్(బుజ్జి) డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం కూడా భారీ హిట్ గా నిలుస్తుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.

8) ఎఫ్ 3:

అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ‘ఎఫ్2’ ని మించి లాభాలను అందిస్తుందని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నారు. అంతేకాదు వెంకటేష్, వరుణ్ తేజ్ కెరీర్లలో కూడా ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలవడం ఖాయం అంటున్నారు. చూడాలి మరి.

9) ఫైటర్ :

పూరి జగన్నాథ్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా రూపొందుతోంది. ఈ చిత్రం కూడా భారీ విజయం సాధించడం ఖాయమని ప్రేక్షకులు భావిస్తున్నారు.

10) అంటే సుందరానికి :

‘బ్రోచేవారెవరురా’ వంటి బ్లాక్ బస్టర్ ను అందించిన దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్న రెండో చిత్రమిది. నాని హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో మలయాళం స్టార్ హీరోయిన్ నజ్రియా నటిస్తుండడం విశేషం. ఈ చిత్రం పై కూడా భారీ అంచనాలే నెలకొన్నాయి.

Share.