ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

సినిమా ఇండస్ట్రీలో అద్భుతాలు చాలానే జరుగుతుంటాయి. చాలా మంది నటీనటులు ఏళ్ళ తరబడి ఇండస్ట్రీలో కష్టపడితేనే కానీ బ్రేక్ రాదు.తరువాత కూడా వస్తుందన్న గ్యారెంటీ కూడా ఉండదు. అయితే కొంతమంది మాత్రం ఇలా ఎంట్రీ ఇవ్వగానే స్టార్లు అయిపోతుంటారు. అతిలోక సుందరి శ్రీదేవి గారినే తీసుకుంటే.. ఆమె 13 ఏళ్ళకే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి స్టార్ అయిపోయింది. అయితే ఆమె బాల నటిగా కూడా సినిమాలు చేసింది అనుకోండి.! అయినప్పటికీ ఆమె టీనేజ్లోనే హీరోయిన్ గా మారి స్టార్ స్టేటస్ ను దక్కించుకుంది.ఇక ఈమెను ఇన్స్పిరేషన్ గా తీసుకుని చాలా మంది భామలు టీనేజ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. వాళ్లలో కొంతమంది సక్సెస్ అయ్యారు. మరికొంతమంది అవ్వలేకపోయారు. సరే ఇంతకీ ఆ భామలు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1)ఇలియానా :

రామ్ హీరోగా వై.వి.ఎస్ చౌదరి డైరెక్షన్లో వచ్చిన ‘దేవదాసు’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది ఇలియానా. 2006 లో ఈ సినిమా విడుదల అయ్యింది. ఆ టైంకి ఈమె వయసు 18 ఏళ్ళు లోపే ఉండడం విశేషం.కానీ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకుంది. ఆ తరువాత ‘పోకిరి’ తో మరో బ్లాక్ బస్టర్ అందుకుని స్టార్ హీరోయిన్ అయిపోయింది.

2)ఛార్మీ :

భీమనేని శ్రీనివాస రావు డైరెక్షన్లో తెరకెక్కిన ‘నీతోడు కావాలి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఛార్మీ. ఈ చిత్రం చేస్తున్న టైములో ఈమె వయసు కేవలం 15 ఏళ్ళు మాత్రమే..!

3) తమన్నా :

మంచు మనోజ్ హీరోగా వచ్చిన ‘శ్రీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది తమన్నా. ఈ చిత్రం వచ్చినప్పుడు ఈమె వయసు 15 ఏళ్ళు మాత్రమే.

4)హన్సిక :

‘దేశముదురు’ సినిమా 16 ఏళ్ళకే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రంతో బన్నీ 6 ప్యాక్ ను టాలీవుడ్ కు పరిచయం చేసాడు.

5)శ్వేత బసు ప్రసాద్ :

17 ఏళ్ళ వయసులోనే ‘కొత్త బంగారు లోకం’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

6)సయాషా సైగల్ :

‘అఖిల్’ చిత్రంతో 17 ఏళ్ళకే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ.

7)అవికా గోర్ :

‘చిన్నారి పెళ్లి కూతురు’ సీరియల్ తో ఫేమస్ అయిన అవికా కూడా ‘ఉయ్యాల జంపాల’ చిత్రంతో 16 ఏళ్ళకే హీరోయిన్ గా మారింది.

8)నందితా రాజ్ :

‘నీకు నాకు డాష్ డాష్’ చిత్రంతో 17 ఏళ్ళకే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

9)రాయ్ లక్ష్మీ :

‘కాంచన మాల కేబుల్ టీవీ’ చిత్రంతో 15 ఏళ్ళకే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. శ్రీకాంత్ ఈ చిత్రంలో హీరోగా నటించాడు.

10)కృతి శెట్టి :

‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి కూడా 17 ఏళ్ళకే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

Share.