2020లో పరిచయమైన హీరోయిన్లు .. వీళ్లకు బాగానే కలిసొచ్చింది..!

కరోనా ఎఫెక్ట్ వల్ల… ఒక్క జనవరి,ఫిబ్రవరి నెలల్లో తప్ప టాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు పెద్దగా పని పడలేదు. షూటింగ్లు ఆగిపోవడం.. చాలా నెలల వరకూ పెద్ద సినిమాల షూటింగ్లు మొదలుకాకపోవడంతో వాళ్ళు రిలాక్స్ అవ్వడానికి టైం దొరికిందని చెప్పొచ్చు. ఇక ఎంటర్టైన్మెంట్ కు ఓటిటి అనేది కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయిన తరుణంలో చిన్న సినిమాల హవా కూడా ఎక్కువగా నడిచింది.

ప్రతీ ఏడాది కొత్త కొత్త హీరోయిన్లు పరిచయమవుతుంటారు అన్న సంగతి తెలిసిందే. అయితే వాళ్ళందరూ ప్రేక్షకులకు చేరువవుతారు అని కచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే సినిమా బాగుంది అంటే తప్ప.. ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లరు కదా. అందుకే..! అయితే ఓటిటిల్లో ప్రేక్షకులు దాదాపు అన్ని సినిమాలు చూస్తూ వచ్చారు. దాంతో.. కొత్తగా ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లకు మంచి గుర్తింపు దక్కిందని చెప్పొచ్చు. అలా 2020లో పరిచయమయ్యి పాపులర్ అయిన హీరోయిన్లు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1) వర్ష బొల్లమ్మ:

గతేడాది ‘విజిల్’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన వర్ష ఈ ఏడాది ‘జాను’, ‘చూసి చూడంగానే’ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించింది. అయితే ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ చిత్రం ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

2) నూరిన్ షరీఫ్ :

2019 లో ‘లవర్స్ డే’ (మలయాళంలో ‘ఒరు అదర్ లవ్’) అనే డబ్బింగ్ చిత్రంలో చిన్న పాత్ర చేసిన నూరిన్.. 2020లో ‘ఉలాల్లా ఉలాల్లా’ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించి మెప్పించింది.

3) రూప కొడువయూర్:

‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రంలో ఎంత చక్కగా నటించిందో ఈ బ్యూటీ.

4) ప్రీతి అస్రాని:

‘మళ్ళీ రావా’ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించిన ఈ బ్యూటీ ‘ప్రెజర్ కుక్కర్’ సినిమా ద్వారా హీరోయిన్ గా మారింది.

5) షాలిని వడ్నికట్టి :

‘కృష్ణ అండ్ హిజ్ లీల’, ‘భానుమతి రామకృష్ణ’.. ఈ రెండు చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. అయితే ఇదే ఏడాది ఈమె పెళ్లి చేసుకుని అందరికీ షాకిచ్చింది.

6) ప్రియా లాల్:

సత్య దేవ్ హీరోగా నటించిన ‘గువ్వా గోరింక’ అనే చిత్రం ద్వారా ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యింది.

7) శివశక్తి సచిదేవ్:

‘అమరం అఖిలం ప్రేమ’ చిత్రంలో తన నటనతో ఆకట్టుకుంది.

8) సలోనీ లూద్రా:

‘ఆహ’ లో విడుదలైన నవీన్ చంద్ర ‘భానుమతి రామకృష్ణ’ చిత్రం ద్వారా పరిచయమై ఆకట్టుకుంది.

9) దివ్యారావ్:

‘డిగ్రీ కాలేజ్’ సినిమాలో తన అందంతో పాటు నటనతో కూడా ఆకట్టుకుంది ఈ బ్యూటీ.

10) అప్సరా రాణి:

‘ఉలాల్లా ఉలాల్లా’, అలాగే రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘థ్రిల్లర్’ చిత్రాల ద్వారా పాపులర్ అయ్యింది.

11) అమితా రంగనాథ్:

‘అమృత రామమ్’ చిత్రం ద్వారా పరిచయమైంది.

12) దృశిక చందర్:

‘బుచ్చినాయుడు కండ్రిగ’ ద్వారా పరిచయమైంది.

13) పూజిత కురపర్తి:

‘గతం’ అనే వైవిధ్యమైన చిత్రం ద్వారా పాపులర్ అయ్యింది.

14) ప్రియాంక శర్మ:

‘సవారి’ అనే చిత్రంతో మంచి క్రేజ్ సంపాదించుకుంది.

15)శ్రీ రాపాక : 

రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన అడల్ట్ కంటెంట్ సినిమా ద్వారా పాపులర్ అయ్యింది.

Share.