శృతీ ఈ సినిమాలను రిజెక్ట్ చేసి మంచి పనే చేసిందా..?

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. తన సొంత ట్యాలెంట్ తో బోలెడంత మంది ఫ్యాన్స్ ను సంపాదించుకుంది శృతీ హాసన్. మ్యూజిక్ డైరెక్టర్ గా.. డ్యాన్సర్ గా పలు ఆల్బమ్స్ చేసిన శృతీ.. వాటితో సక్సెస్ సాధించిన తరువాతే హీరోయిన్ గా మారింది. కెరీర్ ప్రారంభంలో ఈమె నటించిన సినిమాలు అంతగా ఆడలేదు కానీ… ‘గబ్బర్ సింగ్’ చిత్రం మాత్రం ఈమెను గోల్డెన్ లెగ్ గా మార్చేసింది.అటు తరువాత ఈమె నటించిన సినిమాలు అన్నీ దాదాపు హిట్లే. అయితే కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న టైములో విదేశీయుడితో ప్రేమలో పడి సినిమా కెరీర్ ను ఈమె నిర్లక్ష్యం చేసింది.

కానీ కొన్నాళ్ల తరువాత అతనితో బ్రేకప్ చెప్పేసి మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది మన శృతీ హాసన్. ఈ సంక్రాంతికి రవితేజ ‘క్రాక్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకుంది. త్వరలో పవన్ కళ్యాణ్ హీరోగా రాబోతున్న ‘వకీల్ సాబ్’ లో కూడా ఈమె కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘సలార్’ లో కూడా హీరోయిన్ గా ఎంపికయ్యింది.మధ్యలో కాస్త గ్యాప్ వచ్చినప్పటికీ ఇలా వరుసగా టాప్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటుంది అంటే ఈమెకు ఉన్న క్రేజ్ ఏంటన్నది మనం అర్ధం చేసుకోవచ్చు.

అయితే ఈమె గతంలో కొన్ని తెలుగు సినిమాలను కూడా రిజెక్ట్ చేసింది. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

1) బిజినెస్మెన్ :

మహేష్ బాబు – పూరి జగన్నాథ్ ల కాంబినేషన్లో వచ్చిన ఈ సూపర్ హిట్ మూవీని శృతీ మిస్ చేసుకుంది. దాంతో కాజల్ ను ఫైనల్ చేశారు.

2) రెబల్ :

ప్రభాస్- రాఘవ లారెన్స్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘రెబల్’ సినిమాలో హీరోయిన్ గా శృతీ హాసన్ ను అనుకున్నారు. అయితే ఏ పాత్రకు అన్నది క్లారిటీ లేదు. ఏదైనా శృతీ ఈ సినిమాలో నటించే ఛాన్స్ వస్తే మిస్ చేసుకుంది.

3) జెర్సీ : 

గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో వచ్చిన ఈ సూపర్ హిట్ మూవీని కూడా శృతీ మిస్ చేసుకుందట.

4) అమర్ అక్బర్ ఆంటోని :

శ్రీను వైట్ల డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రంలో హీరోయిన్ ఛాన్స్ వస్తే శృతీ వదులుకుందట

5) దువ్వాడ జగన్నాథం :

ఈ చిత్రానికి కూడా మొదట శృతీ హాసన్ నే హీరోయిన్ గా అనుకున్నారు.కానీ ఆమె నో చెప్పడంతో పూజ హెగ్డే ఫైనల్ అయ్యింది.

Share.