మొదటి చిత్రంతో రికార్డ్ ఓపెనింగ్స్ ను రాబట్టిన హీరోలు.. వాటి కలెక్షన్లు..!

ఫిబ్రవరి 12 న అంటే నిన్న విడుదలైన ఉప్పెన చిత్రం ఎబౌవ్ యావరేజ్ టాక్ తోనే రికార్డు కలెక్షన్లను నమోదు చేసింది. దీనికి కారణం ఈ సినిమా పాటలు, టీజర్, ట్రైలర్ వంటివి సూపర్ హిట్ అవ్వడం. దాంతో సినిమా పై విపరీతమైన హైప్ ఏర్పడడం అనే చెప్పాలి. ఏదైతేనేం ఉప్పెన చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కు గ్రాండ్ వెల్కమ్ లభించింది అనే చెప్పొచ్చు. దీంతో డెబ్యూ మూవీతోనే మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్లను రాబట్టిన హీరోగా చరిత్ర సృష్టించాడు వైష్ణవ్ తేజ్. అంతకు ముందు ఈ రికార్డ్ అక్కినేని అఖిల్ పేరుతో ఉండేది.

ఇదిలా ఉండగా … తెలుగు రాష్ట్రాల్లో మొదటి చిత్రంతో మొదటి రోజు హైయెస్ట్ ఓపెనింగ్స్ ను నమోదు చేసిన హీరోలు.. మరియు వారి సినిమాల మొదటి రోజు కలెక్షన్లను ఓ లుక్కేద్దాం రండి :

1) వైష్ణవ్ తేజ్ :

ఉప్పెన చిత్రం మొదటి రోజు 9.3 కోట్ల షేర్ ను రాబట్టింది.

2) అఖిల్ :

వినాయక్ డైరెక్షన్లో తెరకెక్కిన అఖిల్ చిత్రంతో ఇతను మొదటి రోజు 7.6 కోట్ల షేర్ ను రాబట్టాడు.

3) రాంచరణ్ :

చిరుత చిత్రంతో ఇతని మొదటి రోజు 3.75 కోట్ల షేర్ ను రాబట్టాడు.

4) వరుణ్ తేజ్ :

ముకుంద చిత్రంతో ఇతను మొదటిరోజు 3.36 కోట్ల షేర్ ను రాబట్టాడు.

5) బెల్లంకొండ సాయి శ్రీనివాస్ :

అల్లుడు శీను చిత్రంతో ఇతను మొదటి రోజు 2.86 కోట్ల షేర్ ను రాబట్టాడు.

6) నాగ చైతన్య :

జోష్ చిత్రంతో ఇతను మొదటి రోజు 2.60 కోట్ల షేర్ ను రాబట్టాడు.

7) సాయి తేజ్ :

పిల్ల నువ్వులేని జీవితం .. చిత్రంతో మొదటి రోజు ఇతను 2.30 కోట్ల షేర్ ను రాబట్టాడు.

8) రానా :

లీడర్ చిత్రంతో ఇతను మొదటి రోజు 1.7 కోట్ల షేర్ ను రాబట్టాడు.

9) నితిన్ :

జయం చిత్రంతో ఇతను మొదటి రోజు 1.2 కోట్ల షేర్ ను రాబట్టాడు

10) మహేష్ బాబు :

రాజకుమారుడు చిత్రంతో ఇతను మొదటి రోజు 1కోటి పైనే షేర్ ను రాబట్టాడు.

Share.