ఆసక్తి రేపుతున్న ‘బిగ్ బాస్3’ కంటెస్టెంట్స్ లిస్ట్… హౌస్ కు వెళ్ళబోయేది ఎవరెవరంటే?

తెలుగునాట బిగ్ బాస్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటి సీజన్ ను ఎన్టీఆర్ హోస్ట్ చేసి శుభారంభాన్నిచ్చాడు. ఇక రెండో సీజన్ ను నాని ముందుకు తీసుకెళ్ళాడు. ఇప్పుడు మూడో సీజన్ కు హోస్ట్ గా ‘కింగ్’ నాగార్జున వ్యవహరించనున్నాడు. మొదటి సీజన్ వరకూ ఎన్టీఆర్ అండ్ కంటెస్టెంట్లు ఓకే అనిపించినా. రెండో సీజన్లో మాత్రం కంటెస్టెంట్లు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. హోస్ట్ నాని ని కూడా కన్ఫ్యూజ్ చేసేసి అతని పై ట్రోలింగ్ కారణమయ్యారు. ముఖ్యంగా కౌశల్, బాబు గోగినేని, తనీష్, తేజస్వి వంటి వారు ఈ లిస్ట్ లో ఉన్నారు. దీంతో మూడో సీజన్ కంటెస్టెంట్ ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని ఫైనల్ చేశారు.

list-of-bigg-boss-3-contestants1

ఇప్పటి వరకూ.. సీరియల్ యాక్టర్ జాకీ, గుత్తా జ్వాల, వరుణ్ సందేశ్, జబర్దస్త్ ఫేమ్ నరేష్, కృష్ణ చైతన్య, కమల్ కామరాజు, మనోజ్ నందన్, హేమచంద్ర, నాగ పద్మిని, సింధూర గద్దె, శోభిత ధూళిపాల, రఘు మాస్టర్, ఉదయ భాను, వరుణ్ సందేశ్, తీన్మార్ సావిత్రి, ‘మహాతల్లి’ జాహ్నవి వంటి వారు ఈ షోలో పాల్గొంటున్నట్టు ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రచారంలో నిజం లేదని తాజా సమాచారం. అయినప్పటికీ వీరు గనుక షో లో ఉంటే.. నిజంగానే షో కి మంచి క్రేజ్ వస్తుందని కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇక ఇప్పటి వరకూ ఈ షో కి ఫైనలైజ్ అయిన కంటెస్టెంట్ ఒక్క శ్రీముఖి మాత్రమే అని ఫిలింనగర్లో టాక్. మరి మిగిలిన 15 మంది ఎవరనేది మరో 3 రోజుల్లో ప్రకటిస్తారని సమాచారం. ఇక జులై 21 నుండీ ‘బిగ్ బాస్ 3’ మొదలు కానుందనే వార్త కూడా ఫిలింనగర్లో చక్కర్లు కొడుతుంది.

శ్రీముఖి

list-of-bigg-boss-3-contestants2

తీన్మార్ సావిత్రి

list-of-bigg-boss-3-contestants3

జాకీ

list-of-bigg-boss-3-contestants4

గుత్తా జ్వాల

list-of-bigg-boss-3-contestants5

జబర్దస్త్ ఫేమ్ నరేష్

list-of-bigg-boss-3-contestants7

కృష్ణ చైతన్య

list-of-bigg-boss-3-contestants8

కమల్ కామరాజు

list-of-bigg-boss-3-contestants9

మనోజ్ నందన్

list-of-bigg-boss-3-contestants10

హేమచంద్ర

list-of-bigg-boss-3-contestants11

నాగ పద్మిని

list-of-bigg-boss-3-contestants12

సింధూర గద్దె

list-of-bigg-boss-3-contestants13

శోభిత ధూళిపాల

list-of-bigg-boss-3-contestants14

రఘు మాస్టర్

list-of-bigg-boss-3-contestants15

ఉదయ భాను

list-of-bigg-boss-3-contestants16

వరుణ్ సందేశ్

list-of-bigg-boss-3-contestants17

Share.