ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!

తెరపై కనిపించే వాళ్లనో లేక క్రికెట్ సెలబ్రిటీలనో ప్రజలు విపరీతంగా ఆరాధిస్తుంటారు. చాలామంది అభిమానులు ఆ ఆరాధనను ఆదర్శంగా కూడా మలుచుకుంటారన్న సంగతి మనకి తెలిసిందే. అయితే.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వారి విషయంలో మాత్రం ఆదర్శంగా తీసుకోవడం అంత మంచిది కాదేమో. ఎందుకంటే వీరంతా పెళ్లి కాక ముందే పిల్లల్ని కనేశారు మరి. సినిమా వారి నుంచి క్రికెటర్ల వరకూ ఇలా త్వరపడిన వారి జాబితాలో ఉండటం గమనార్హం. మరి ఈ సె లబ్రిటీలెవరో ఒకసారి చూద్దాం రండి.

1 -రేణు దేశాయ్ – పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇష్టపడి పెళ్లిచేసుకున్న తొలి భార్య నుంచి విడిపోవడంతో తర్వాత పెళ్లి చేసుకోదలుచుకోలేదు. బద్రి సినిమాలో తనతో నటించిన రేణు దేశాయ్ తో సహజీవనం చేశారు. వీరిద్దరికీ 2004 లో అకీరా పుట్టాడు. అప్పుడు తల్లి దండ్రులు అయిన వీరిద్దరూ 2009 లో పెళ్లి చేసుకుని భార్య భర్తలయ్యారు.

2 – నేహా ధూపియా- అంగద్ బేడీ

తెలుగులో రాజశేఖర్ విలన్ సినిమాతో మన ప్రేక్షకులకు తెలిసిన బాలీవుడ్ బ్యూటీ నేహా ధూపియా. బాలయ్య పరమవీర చక్ర సినిమాలోనూ తళుక్కున మెరిసిన ఈ ముద్దుగుమ్మ, తన బాయ్ ఫ్రెండ్ అంగద్ బేడీతో సహజీవనం చేసేది. ఈ క్రమంలో తల్లైంది. విషయం బయటికి వచ్చిన తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.

3 – కమల్ హాసన్-సారిక

విశ్వనటుడు కమల్ హాసన్ గురించి కొత్తగా చెప్పేదేముంది. అందరూ సంప్రదాయ దారిలో వెళ్తున్నా.. తనదైన ప్రత్యేక బాటలో వెళ్లే విలక్షణ నటుడాయన. ఒకప్పటి హీరోయిన్ సారికతో ఆయన అప్పట్లోనే లివింగ్ రిలేషన్ షిప్ చేశారు. వీరిద్దరి పెళ్లి అవ్వక ముందే శ్రుతి హాసన్ జన్మించింది. దీంతో ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన తర్వాత వీళ్లకు అక్షర హాసన్ జన్మించింది.

4 – శ్రీదేవి-బోనీ కపూర్

అతిలోక సుందరి శ్రీదేవి కూడా ఈ జాబితాలో ఉందా అని షాకవుతున్నారా.. అవును ఉంది. టాప్ హీరోయిన్ గా బాలీవుడ్ లో వెలుగుతున్న శ్రీదేవి, నిర్మాత బోనీ కపూర్ తో సహజీవనం చేశారు. దీంతో ఆమె గర్భం దాల్చారు. ఈ క్రమంలో ఆమెకు 7నెలల గర్భం ఉన్నప్పుడు ఇద్దరూ పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు.

5 – అమృత అరోరా

గబ్బర్ సింగ్ సినిమాలో కెవ్వు కేక పాటకు చిందులేసిన మలైకా అరోరా గుర్తుందా.. ఆ అమ్మడి సోదరి ఈ అమృత అరోరా. షకీలా లదక్ అనే వ్యక్తితో అమృత సహజీవనం చేసింది. అయితే.. అనుకోకుండా గర్భం దాల్చడంతో హడావుడిగా లివింగ్ రిలేషన్ స్టేటస్ నుంచి వైవాహిక జీవితానికి ఇద్దరూ షిఫ్ట్ అయ్యారు.

6 – హార్దిక్ పాండ్యా

మైదానంలో సిక్సర్లతో విరుచుకుపడే టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, నిజ జీవితంలోనూ దూకుడుగానే ఉంటాడు. సెర్బియాకు చెందిన యువతి నటాషా స్టాన్కోవిచ్ తో ప్రేమాయణం సాగించిన హార్దిక్, పెళ్లి కాకుండానే తండ్రి అయ్యాడు. ఆ తర్వాతే గర్ల్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశాడు.

7 – కల్కి కొక్లెయిన్

బాలీవుడ్ నటి కల్కి కొక్లెయిన్ తొలుత దర్శకుడు అనురాగ్ కశ్యప్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే.. ఆ తర్వాత అతనితో చెడిపోవడంతో విడాకులు తీసుకుంది. తర్వాత హర్ష బెర్గ్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. అయితే.. తొలి పెళ్లి అనుభవం బాగోకపోవడం వల్లనో ఏమో.. హర్షను పెళ్లి చేసుకోకుండానే తల్లి అయింది.

8 – నటి అమీ జాక్సన్-జార్జ్

శంకర్ ఐ సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలు కొల్లగొట్టింది అమీ జాక్సన్. ఎక్కువగా తమిళంలోనే సినిమాలు చేసిన ఈ ముద్దు గుమ్మ, ఆ తర్వాత ప్రేమలో పడటంతో సినిమాలకు దూరమైంది. బాయ్ ఫ్రెండ్ తో లివింగ్ రిలేషన్ షిప్ లో ఉండగానే తల్లైంది. బ్రిటన్ యువతి కావడంతో.. పెళ్లి చేసుకోవాలన్న ఆరాటమైతే ప్రస్తుతం ఈ అమ్మడిలో లేదు. తల్లి, బిడ్డ, తండ్రి అందరూ ప్రస్తుతం హ్యాపీ.

9 – మహిమా చౌదరి-బాబీ ముఖర్జీ

బాలీవుడ్ సెక్స్ బాంబ్ గా పేరొందిన మహమా చౌదరి, బాబీ ముఖర్జీ అనే ఆర్కిటెక్టును పెళ్లి చేసుకుంది. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. వీరి పెళ్లై ఐదు నెలలకే బిడ్డ పుట్టడంతో.. ప్రపంచానికి విషయం అర్థమైంది.

10 – సెలీనా జైట్లీ-పీటర్ హాగ్

బాలీవుడ్ హాట్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న సెలీనా, పీటర్ హాగ్ అనే విదేశీయుడితో ప్రేమలో ఉంది. ఇద్దరూ ప్రేమలో ఉన్నారు తప్ప ఇంకా పెళ్లి వరకూ వెళ్లలేదు. అయినా.. సెలీనా ఒక బిడ్డకు తల్లైంది.

11 – కొంకణ సేన్-రణవీర్

కొంకణ సేన్ శర్మ, తన బాయ్ ఫ్రెండ్ రణవీర్ తో పీకల వరకూ ప్రేమలో మునిగితేలింది. లివింగ్ రిలేషన్ లో లైఫ్ ఎంజాయ్ చేస్తున్న సమయంలో అమ్మడు అమ్మైంది. దీంతో ఇద్దరూ పెళ్లి చేసుకుని ఒక ఇంటివారయ్యారు.

Share.