కన్నడ ప్రేక్షకులు టీవీల్లో ఎక్కువగా చూసిన తెలుగు సినిమాలు ఇవే..!

‘బాహుబలి'(సిరీస్) తో తెలుగు సినిమా స్టామినా ఏంటన్నది ఇండియా మొత్తం తెలిసొచ్చింది. సౌత్లోని అన్ని భాషలతో పాటు నార్త్ లో కూడా మన తెలుగు సినిమాలకు ఆదరణ పెరిగింది. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు ఎక్కువగా రూపొందుతున్నాయన్నా.. అలాగే టాలీవుడ్ లో స్టార్ హీరోలు పాన్ ఇండియా సినిమాల పై దృష్టిపెట్టారన్నా అది ‘బాహుబలి'(సిరీస్) వల్లే అని చెప్పాలి. ఇదిలా ఉండగా.. మన తెలుగు సినిమాలను ఎగబడి చూస్తున్న ప్రేక్షకుల్లో కన్నడీయులు కూడా ఎక్కువగానే ఉన్నారని చెప్పాలి.

చాలా వరకూ అక్కడ మన తెలుగు వాళ్ళే ఉంటారు కాబట్టి.. అక్కడి థియేటర్లలో మన తెలుగు సినిమాలకు భారీ కలెక్షన్లు నమోదవుతుంటాయి. అలా అని అక్కడి లోకల్ జనాలు మన తెలుగు సినిమాలను పెద్దగా చూడరు అనుకుంటే పొరపాటే. థియేటర్లకు వారు రాకపోయినా.. టీవీల్లో టెలికాస్ట్ అయ్యే మన తెలుగు సినిమాలను( కన్నడ డబ్బింగ్ వెర్షన్లను) వారు ఎక్కువగానే వీక్షిస్తున్నారు.అందుకే ఆ సినిమాలకు మంచి టి.ఆర్.పి రేటింగ్లు నమోదవుతున్నాయి. అలా ఇప్పటి వరకూ కన్నడలో సత్తా చాటిన తెలుగు సినిమాలు ఏవో.. వాటి రేటింగ్లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) సరిలేరు నీకెవ్వరు : 6.5 టి.ఆర్.పి రేటింగ్

2) సైరా నరసింహారెడ్డి : 6.3 టి.ఆర్.పి రేటింగ్

3) సరైనోడు : 6.3 టి.ఆర్.పి రేటింగ్

4) బాహుబలి 1 : 6.3 టి.ఆర్.పి రేటింగ్

5) రంగస్థలం : 6 టి.ఆర్.పి రేటింగ్

6) మగథీర : 5.9 టి.ఆర్.పి రేటింగ్

7) బాహుబలి 2 :5.71 టి.ఆర్.పి రేటింగ్

8) గీత గోవిందం : 5.6 టి.ఆర్.పి రేటింగ్

9) అల వైకుంఠపురములో : 5.34 టి.ఆర్.పి రేటింగ్

10) డియర్ కామ్రేడ్ : 5.03 టి.ఆర్.పి రేటింగ్

11) అఆ : 4.41 టి.ఆర్.పి రేటింగ్

Share.