సందీప్‌ కిషన్‌ గాలి తీసేసిందా.. లేక కావాలనేనా

ఓ హీరోను హీరోయిన్‌ అన్న అని పిలవడం చాలా అరుదు. అందులో యువ హీరో, హీరోయిన్ల విషయంలో అయితే అసాధ్యమనే చెప్పాలి. ఆ రోజుల్లో ఎప్పుడో శ్రీకాంత్‌ను.. రోజా అన్నయ్య అనేవారట. మళ్లీ ఇన్నాళ్లకు ఓ కుర్ర హీరోను.. మరో కుర్ర హీరోయిన్‌ అన్న అని పిలిచింది. అది కూడా సినిమా సెట్‌లో కాదు… ఏకంగా సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో. అవును ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లోనే హీరోయిన్‌.. హీరోని అన్న అని పిలిచింది. అయితే ఆ తర్వాత నాలుక కరుచుకుంది అనుకోండి. ఇప్పటికే మీకు అర్థమైపోయుంటుంది ఆ ఇద్దరు ఎవరా అని.. లేదంటే ఈ వార్త చదివేయండి.

‘A1 ఎక్స్‌ప్రెస్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఇటీవల జరిగింది తెలుసు కదా. ఆ వేదిక మీదే ఈ ‘అన్న’ కాన్సెప్ట్‌ జరిగింది. సినిమా నాయిక లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ… హీరో సందీప్‌ కిషన్‌ గురించి చెప్పబోయింది. దాని కోసం ‘సందీప్‌ అన్న’ అంటూ సంబోధించింది. ఈలోగా అక్కడున్న ఫ్యాన్స్‌ (?) ‘ఊ….’ అంటూ గొంతెత్తేసరికి ‘అన్న మీకు… నాకు కాదు’ అంటూ కవర్‌ చేసేసింది. అయితే అసలు సందీప్‌ని లావణ్య ‘అన్న’ అని ఎందుకంది అనేదే ఇప్పుడు టాలీవుడ్‌లో ట్రెండింగ్‌ టాపిక్‌.

లావణ్య త్రిపాఠికి యటకారం ఎక్కువని నిన్నే మన సైట్‌లో చదువుకున్నాం. అందులో భాగంగానే సందీప్‌ను అన్న అని పిలిచిందా అనేది తెలియడం లేదు. లేక సినిమాలో అందరూ సందీప్‌ను ‘అన్న’ అంటారు కాబట్టి… ఆ ఫ్లోలో స్టేజీ మీద అలా పిలిచేసిందా అనేది సినిమా వచ్చాక తెలుస్తుంది. ఈలోపు ఈ ‘అన్న.. తూచ్‌ అన్న కాదు’ వీడియోను మీరూ చూసేయండి.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Share.