జోడీ మీద భారీ ఆశలు పెట్టుకొన్న ఆది

తండ్రి సాయికుమార్ పూణ్యమా అని ఇండస్ట్రీలో బోలెడన్ని పరిచయాలు. ఆల్మోస్ట్ అందరు స్టార్ దర్శకులకు వెళ్లడానికి ఛాన్స్ ఉన్నప్పటికీ.. ఎందుకో ఆది సాయికుమార్ మాత్రం ఇప్పటివరకూ సరైన సక్సెస్ టేస్ట్ చేయలేకపోతున్నాడు. అప్పుడెప్పుడో “ప్రేమ కావాలి”తో ఇండస్ట్రీకి పరిచయమైన ఆదికి “లవ్లీ, శమంతకమణి” తప్ప చెప్పుకోదగ్గ విజయం సాధించిన సినిమా ఒక్కటీ ఖాతాలో లేదు. దాంతో ఆది కొన్నాళ్లపాటు డిప్రెషన్ లోకి కూడా వెళ్లిపోయాడు. ముఖ్యంగా చాలా ఆశలు పెట్టుకొన్న “నెక్స్ట్ నువ్వే, బుర్రకథ” లాంటి సినిమాలు డిజాస్టర్లుగా నిలవడం ఆదికి కోలుకోలేని దెబ్బగా మారాయి.

last-chance-for-aadi-sai-kumar1

దాంతో ఈ శుక్రవారం విడుదలవుతున్న “జోడీ” సినిమా మీద చాలా ఆశలు పెట్టుకొన్నాడు ఆది. శ్రద్ధాశ్రీనాథ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం రేపు విడుదలవుతుంది. అసలే “సాహో” థియేటర్లలో హల్ చల్ చేస్తున్న తరుణంలో “జోడీ” చిత్రాన్ని జనాలు పట్టించుకొంటారా అనే అనుమానాలు కూడా ఉన్నప్పటికీ.. ఆదికి ఈ సమయంలో కావాల్సింది కమర్షియల్ హిట్ కాదు.. సినిమా బాగానే ఉంది అనే టాక్. ముఖ్యంగా “బుర్రకథ” చిత్రాన్ని జనాలు వరస్ట్ మూవీ ఆఫ్ ది ఇయర్ అని డిక్లేర్ చేసేయడంతో “జోడీ”తో కనీసం ఒక మంచి సినిమా చేశానన్న సంతృప్తి కోసం ఆది కష్టపడుతున్నాడు. మరి అతడి ఆశలను జోడీ నెరవేరుస్తుందో లేదో చూడాలి.

Share.