సిక్స్ ప్యాక్ తో ఇరగదీసిన నాగశౌర్య..!

జనవరి 22వ తేదిన నాగశౌర్య బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కి డబుల్ థమాకా ఇచ్చాడు. తను యాక్ట్ చేస్తున్న సినిమాల నుంచి అప్ డేట్స్ ని రిలీజ్ చేశాడు. వరుడు కావలెను సినిమా యూనిట్ పోస్టర్ ని రిలీజ్ చేస్తే, లక్ష్య సినిమా నుంచి చిన్న టీజర్ ని రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఆర్చరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రల్లో నాగశౌర్య కనిపించబోతున్నాడు. నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ఇప్పుడు అత్యధిక లైక్స్ తో సినీ లవర్స్ ని ఆకట్టుకుంటోంది. జగపతి బాబు వాయిస్ తో స్టార్ట్ అయిన ఈ టీజర్ ని మనం చూసినట్లయితే,

చాలామందికి ఆటతో గుర్తింపు వస్తుంది. కానీ ఒక్కడు పుడతాడు. వాడి వల్ల ఆటకే గుర్తింపు వస్తుంది అనే డైలాగ్స్, అలాగే పడిలేచిన వాడితో పందెం చాలా ప్రమాదకరం అంటూ లాస్ట్ లో చెప్పే డైలాగ్స్ నెటిజన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. దెబ్బతిన్న పులిగా ఆవేశంగా లాస్ట్ లో పంతంతో పందెం గెలిచేలా సిక్స్ ప్యాక్ తో కనిపిస్తున్నాడు నాగశౌర్య. చాలా రఫ్ లుక్ లో తన సిక్స్ ప్యాక్ షాట్ ని రివీల్ చేశారు. హ్యాపీ బర్త్ డే నాగశౌర్య అంటూ సినిమా ఎలా ఉండబోతోందో చిన్న టీజర్ లోనే చూపించేశారు.

అంతేకాదు, నాగశౌర్య కి కోపం ఎక్కువగా ఉన్నట్లు, అందుకే ఆటకి దూరమైనట్లుగా కూడా సీన్స్ కనిపిస్తున్నాయి. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా ఇప్పుడు సినీ లవర్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీరేంద్ర సంతోష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. కాలభైరవ మ్యూజిక్ ని అందిస్తున్నాడు. మరికెందుకు ఆలస్యం టీజర్ ని మీరు కూడా ఒక లుక్కేయండి..


మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.