పుష్ప మూవీ విలన్ పై క్రేజీ గాసిప్, నిజమైతే రచ్చ రచ్చే..!

2020ని అల వైకుంఠపురలో వంటి ఇండస్ట్రీ హిట్ తో మొదలుపెట్టిన అల్లు అర్జున్, సుకుమార్ మూవీతో పాన్ ఇండియా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. శేషాచలం అడవులలో జరిగే రెడ్ శాండిల్ అక్రమ రవాణా నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతుండగా బన్నీ లారీ డ్రైవర్ గా డీ గ్లామర్ రోల్ చేస్తున్నాడు. కాగా ఈ మూవీపై ఓ క్రేజీ గాసిప్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఈ మూవీలో విలన్ పాత్ర కోసం ఒకప్పటి హీరోయిన్ వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎం ఎల్ ఏ రోజాని తీసుకుంటున్నారట.

ఓ పవర్ ఫుల్ లేడీ విలన్ రోల్ కోసం ఆమెను సంప్రదించగా ఆమె ఒకే కూడా చెప్పారని వార్తలు వస్తున్నాయి. ఇక బన్నీ పాత్రకు సవాలు విసిరే క్రూయల్ లేడీ విలన్ గా ఈమె పాత్ర ఉండే అవకాశం కలదట. మరి ఇదే కనుక నిజం అయితే పుష్ప సినిమాకు అదనపు ఆకర్షణ చేకూరినట్టే. ఇక గతంలో రోజా కొన్ని సినిమాలో విలన్ రోల్స్ కూడా చేశారు. గోపి చంద్ హీరోగా కృష్ణ వంశీ తెరకెక్కించిన మొగుడు సినిమాలో ఆమె విలన్ రోల్ చేశారు.

Allu Arjun's Pushpa Movie First Look Poster Review1

రవితేజ, అల్లరి నరేష్ ల మల్టీస్టారర్ శంభో శివ శంభో చిత్రంలో కూడా ఆమె విలన్ పాత్ర చేయడం జరిగింది. ఈ వార్తలో స్పష్టత రావాలంటే మరి కొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న పుష్ప సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందాన నటిస్తుంది. ఇక ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ అందిస్తున్నారు. మరి కొద్దిరోజులలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.

Most Recommended Video

రన్ మూవీ రివ్యూ & రేటింగ్
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!
ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!

Share.