బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పై ఘాటు వ్యాఖ్యలు!

బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వెళ్లిన నటుడు కుమార్ సాయి ఆరో వారం ఎలిమినేషన్ లో బయటకి వచ్చేశారు. అతడిని కావాలనే ఎలిమినేట్ చేశారనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. హౌస్ నుండి బయటకి వచ్చిన కుమార్ సాయి.. హౌస్ లో ఎవరు ఎలా ఉంటున్నారు..? తన ఎలిమినేషన్ కి కారణాలు ఏంటనే విషయాల గురించి మాట్లాడారు. హౌస్ నుండి బయటకి వచ్చిన తరువాత అందరూ బాధపడుతున్నారని.. ఓట్లు వేశాం.. నువ్ ఎలా ఎలిమినేట్ అయ్యావంటూ ప్రశ్నిస్తున్నారని చెప్పారు కుమార్ సాయి.

మొదట తను హౌస్ లోకి వెళ్లినప్పుడు కంఫర్టబుల్ గా అనిపించలేదని.. అప్పటికే కొంతమంది గ్రూపులుగా ఉన్నారని.. కానీ ఎలా ఉన్నా గేమ్ వచ్చేసరికి సింగిల్ గానే ఆడుతున్నారని.. పైకి మాత్రం నటిస్తూ ఉన్నారని చెప్పుకొచ్చాడు. వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లోకి వెళ్లడం మైనస్ అయిందని తన అభిప్రాయాన్ని చెప్పాడు. అప్పటికే అందరూ ఫ్రెండ్స్ తో సెట్ అయిపోవడంతో.. తనను కలుపుకోలేదని.. మనుషులైతే అలా చేయరని.. కొన్ని జంతువులు మాత్రమే అలా చేస్తాయని సంచలన కామెంట్స్ చేశారు. హౌస్ మేట్స్ అలా చేశారని అనడం లేదు కానీ.. తనను మాత్రం దూరంగానే ఉంచారని చెప్పుకొచ్చాడు.

వాళ్లు దూరం పెట్టినా.. కలవడానికి ప్రయత్నించినట్లు.. కానీ కుదరలేదని చెప్పారు. హౌస్ లో నామినేషన్ ప్రాసెస్ వచ్చిన ప్రతీసారి కావాలని తనను నామినేట్ చేసేవారని కుమార్ సాయి అన్నారు. ఓ వ్యక్తి నేరుగా తన దగ్గరకి వచ్చి.. నిన్ను కావాలని నామినేట్ చేయలేదు కానీ పలానా వాళ్ల కోసం తప్పడం లేదంటూ చెప్పిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేసుకున్నాడు.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Share.