యశ్ అదరగొట్టాడు : కేటిఆర్

తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ఇటీవల యశ్ హీరోగా వచ్చిన కన్నడ సూపర్ హిట్ చిత్రం ‘కే.జి.ఎఫ్’ పై స్పందించారు. ఇటీవల ఈ చిత్రం చూసిన ఆయన ట్విట్టర్ లో తన స్పందనని తెలియజేసారు. ఈ చిత్రం డిసెంబర్ లో విడుదలయ్యి అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ గా నిలిచింది. ‘బాహుబలి’ చిత్రం తరువాత ఈ రేంజ్లో అన్ని భాషల్లోనూ విజయం సాధించిన చిత్రం ‘కే.జి.ఎఫ్’ అనడంలో సందేహం లేదు.

ktr-review-on-kgf-movie1

ఇక ఈ చిత్రం కేటిఆర్ స్పందిస్తూ… ” కొంచెం లేట్ అయ్యింది. తాజాగా ‘కే.జి.ఎఫ్’ చిత్రాన్ని చూశాను. సినిమా చాలా బాగుంది. టెక్నికల్ కూడా చాలా బాగుంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అద్బుతంగా ఈ చిత్రాన్ని తీసాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్… యాక్షన్ సన్నివేశాలు.. అన్నీ చాలా బాగున్నాయి. రాక్ స్టార్ – హీరో యశ్ నటన అదిరిపోయింది”… అంటూ తన ట్విట్టర్లో పేర్కొన్నారు కేటిఆర్. ఇక ఈ చిత్రం రెండవ పార్ట్ అయిన ‘కే.జి.ఎఫ్’ చాప్టర్ 2 ను భారీ ఎత్తున రూపొందిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ‘సంజయ్ దత్’ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఈ చిత్రం కోసం ఇప్పటి నుండే అన్ని బాష ల ప్రేక్షకులు ఎదురు చూస్తుండడం విశేషం.

Share.