‘సాహో’ తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచింది : కేటీఆర్‌

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన తాజా చిత్రం ‘సాహో’. ‘బాహుబలి’ తరువాత సుమారు రెండేళ్ళు కష్టపడి ఈ సినిమా చేశాడు ప్రభాస్. గత శుక్రవారం(ఆగష్టు 30న) విడుదలైన ఈ చిత్రం మొదటి షో తోనే డివైడ్ టాక్ మూట కట్టుకుంది. దర్శకుడు సుజీత్ యూజ్ చేసిన ఇంటెలిజెన్స్ చాలా మందికి అర్ధం కాకపోవడమే అని చెప్పొచ్చు. అయితే ఈ చిత్రం హిందీ లో మాత్రం ఈ చిత్రానికి ఆదరణ పెరుగుతూనే ఉంది. దీంతో తెలుగు ప్రేక్షకులు అసలు వాళ్ళకు ఎలా నచ్చిందా అని థియేటర్లకు వెళ్ళడం మొదలు పెట్టారు. ఇప్పుడు స్లోగా ఈ చిత్రానికి ఆదరణ పెరుగుతుంది. ఇక ఈ చిత్రాన్ని చూసిన కేటీఆర్‌ తన అభిప్రాయాన్ని ట్విట్టర్లో చెప్పుకొచ్చాడు.

ktr-comments-on-saaho-movie1

కేటీఆర్‌ మాట్లాడుతూ… “ఈరోజు నేను రెండు అద్భుతమైన సినిమాలు చూశాను. ‘ సాహో’ చిత్రం టెక్నికల్‌గా అద్భుతంగా ఉంది. మన తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచేలా ఉంది.హీరో ప్రభాస్ అలాగే దర్శకుడు సుజీత్ కు నా అభినందనలు. ఈ చిత్రంతో పాటు ‘ఎవరు’ కూడా చూశాను. గ్రిప్పింగ్‌ స్క్రీన్‌ప్లేతో సినిమా బ్రిలియెంట్‌గా తెరకెక్కించారు. అడివి శేష్‌, రెజీనా, నవీన్‌చంద్ర అద్భుతంగా నటించారు అంటూ చెప్పుకొచ్చారు. ‘ఎవరు’ చిత్రం అడివి శేష్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ‘సాహో’ చిత్రం కూడా మంచి కలెక్షన్లను రాబడుతుంది.

Share.