20 ఏళ్ళ తరువాత తన భార్యను డైరెక్ట్ చేయనున్న కృష్ణవంశీ..!

క్రియేటివ్ డైరెక్టర్ గా మంచి క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు కృష్ణవంశీ. తెలుగు ప్రేక్షకులకి ఆయన ఎన్నో క్లాసిక్స్ ఇచ్చారు. మహేష్ బాబు లాంటి స్టార్ హీరో అప్పట్లో ప్లాపుల్లో ఉంటే హిట్టిచ్చి ఆదుకున్నది ఈ కృష్ణవంశీ నే..! పాటలు చిత్రీకరించడంలో కానీ కుటుంబ కదా చిత్రాలు తెరకెక్కించడంలో కానీ కృష్ణవంశీ సిద్ధహస్తుడు. ఇప్పటికీ ఓ కుటుంబం అంతా కూర్చొని భోజనం చేస్తున్న విజువల్ ఎవరైనా చూస్తే.. ఇది కృష్ణవంశీ స్టైల్ లో ఉందేంటి అని టక్కున కామెంట్ చేస్తారు. అంతలా చెరగని ముద్ర వేశారు కృష్ణవంశీ.

krishna-vamsi-with-his-wife-ramya-krishna

అయితే ఈ మథ్య కాలంలో ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలు ప్లాపులు అవుతూ వస్తున్నాయి. దీంతో ఈసారి ఎలాగైనా హిట్టందుకోవాలని ఓ మరాఠీ రీమేక్ ను నమ్ముకున్నాడాయన..! ‘నటసామ్రాట్’ అనే పేరుతో తెరకెక్కబోతున్న రీమేక్ లో నానా పాటేకర్ పోషించిన పాత్రకు ప్రకాష్ రాజ్ ను ఎంచుకున్నాడు. ఇక ప్రకాష్ రాజ్ కు జోడీగా తన భార్య రమ్యకృష్ణను ఎంచుకున్నాడు కృష్ణవంశీ. 1998 లో ‘చంద్రలేఖ’ చిత్రం తర్వాత సుమారు 20 ఏళ్ళ తరువాత రమ్యకృష్ణను డైరెక్ట్ చేయబోతున్నాడు కృష్ణవంశీ. అయితే 2004లో వచ్చిన ‘శ్రీ ఆంజనేయం’ చిత్రంలో కూడా రమ్యకృష్ణ అలాగే ప్రకాష్ రాజ్ కనిపిస్తారు. అయితే అవి అతిధి పాత్రలు మాత్రమే..! కానీ ఈ సారి ఫుల్ లెంగ్త్ రోల్స్ అన్నమాట..!

బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?
చిరంజీవి అతిధి పాత్ర చేసిన సినిమాలు?

Share.