ఎన్టీఆర్ బయోపిక్ కోసం మా మధ్య గొడవ జరగలేదు

ఎన్టీఆర్ కథానాయకుడు విడుదలైనప్పట్నుంచి చిత్ర కథానాయకుడు బాలయ్య మీద వచ్చిన వార్తలకంటే దర్శకుడు క్రిష్ మీద వచ్చిన న్యూసే ఎక్కువ. ముఖ్యంగా.. “మణికర్ణిక” విడుదలయ్యాక క్రిష్ గురించి చాలా రచ్చ జరిగింది. కంగనా పుణ్యమా అని క్రిష్ పరువు పోయింది. అది సరిపోదన్నట్లు ఇప్పుడు క్రిష్ కి బాలయ్యతో గొడవలు జరుగుతున్నాయని వార్తలు హల్ చల్ చేయడం జరిగింది. దాంతో.. స్వయంగా క్రిష్ వివరణ ఇవ్వాల్సిన పరిస్తితి ఏర్పడింది.

రేపు “ఎన్టీఆర్ మహానాయకుడు” విడుదలవుతుండగా.. ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్రిష్ మాట్లాడుతూ.. “అసలు నాకు బాలయ్యతో గొడవలేమీ లేవు. అలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తున్నాయో కూడా తెలియదు. ఆ విషయాన్ని ఖండించాలని కూడా నాకు ఎప్పుడూ అనిపించలేదు. నాకు బాలయ్యతో మంచి రిలేషన్ ఉంది, ఇకపై ఉంటుంది కూడా. ఎవరి కోసమే నేను స్పెషల్ గా మా మధ్య గొడవల్లేవ్ అని చెప్పాల్సిన అవసరం లేదు” అని స్పందించాడు

Share.