మెగాహీరో సినిమాను పూర్తి చేసిన క్రిష్!

టాలీవుడ్ లో దర్శకుడు క్రిష్ జాగర్లమూడికి ప్రత్యేక గుర్తింపు ఉంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూ సరికొత్త కథలను ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటాడు. ‘గమ్యం’ సినిమాతో తన సత్తా చాటుకున్న ఈ దర్శకుడు తన ‘వేదం’, ‘కృష్ణం వందే జగద్గురుమ్’ వంటి చిత్రాలతో తన క్రేజ్ ను మరింతగా పెంచుకున్నారు. బాలకృష్ణ నటించిన వందవ సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ లాంటి చారిత్రక చిత్రాన్ని తక్కువ బడ్జెట్ లో కేవలం 80 రోజుల్లోనే అద్భుతంగా తెరకెక్కించి శభాష్ అనిపించుకున్నాడు.

తనలోని సూపర్ స్పీడ్ ని మరోసారి నిరూపించుకున్నాడు ఈ దర్శకుడు. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు క్రిష్. ఇందులో రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తోంది. అటవీనీ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని చాలా వారకు వికారాబాద్ ఫారెస్ట్ లోనే చిత్రీకరించారు. కరోనా, భారీ వర్షాలను లెక్క చేయకుండా షూటింగ్ నిర్వహించారు. కేవలం 35 రోజుల్లోనే సినిమా టాకీ మొత్తం పూర్తి చేశారు. మిగిలిన ఒక్క పాటను మరో ఐదు రోజుల్లో పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది.

ఈ విషయాన్ని రకుల్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసింది. ‘డ్రీమ్ టీమ్.. డ్రీమ్ రోల్.. ఇంకా ఒక్క పాట మాత్రమే మిగిలి ఉందని’ ఆమె పేర్కొంది. ఈ లెక్కన చూసుకుంటే కేవలం 40 రోజుల్లోనే సినిమాను పూర్తి చేయనున్నారు క్రిష్.

Most Recommended Video

కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!

Share.